Andhra Pradesh: ధిక్కారమా.. లేక పంతమా..! సీఎం జగన్ మాట వినని భక్తుడు.. ఏపీ రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ బ్యాచ్‌లో మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్ కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉంటారు.. ఆంజనేయుడు గుండె చీలిస్తే శ్రీరామచంద్రుడు ఉన్నట్లు అనిల్ గుండె చీలిస్తే జగన్ కనిపిస్తాడు.. అనేలా ఆయన వ్యవహారం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ బ్యాచ్‌లో మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్ కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉంటారు.. ఆంజనేయుడు గుండె చీలిస్తే శ్రీరామచంద్రుడు ఉన్నట్లు అనిల్ గుండె చీలిస్తే జగన్ కనిపిస్తాడు.. అనేలా ఆయన వ్యవహారం ఉంటుంది. ఇదే విషయాన్ని అనిల్ పలుమార్లు స్వయంగా చెప్పారు. జగన్ పట్ల ఇంతటి అభిమానం ప్రదర్శించడం వల్లే నెల్లూరు నగరం నుండి రెండు సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా జగన్ ముఖ్యమంత్రి కాగానే.. ఆయన కేబినెట్లో అత్యంత కీలకమైన జలవనరుల శాఖ మంత్రి భాద్యతలు చేపట్టగలిగారు. రెడ్ల ప్రాబల్యం కలిగిన నెల్లూరు సిటీలో ఒకసారి కాంగ్రెస్ నుంచి రెండు సార్లు వైసీపీ నుండి వరుసగా సీటు సాధించిన తొలి బీసీ నాయకుడు అనిల్.. అయితే ఈ జిల్లాలోనే తొలి బీసీ మంత్రి కూడా అనిలే.. జగన్ పట్ల అనిల్ చాటుకున్న విశ్వాసం, అలాగే, అనిల్ పట్ల జగన్ చూపిన ఆదరణకు ఇదో సంకేతం..
అయితే, ఇప్పుడు అనిల్‌కు జగన్ పై ఉన్న ఆ నమ్మకం, అభిమానం తగ్గు ముఖం పట్టిందా? అనిల్ కూడా సాధారణ రాజకీయ నాయకుడి లానే వ్యవహరిస్తున్నారా? తన వ్యక్తిగత పంతం కోసం తనకు దైవం లాంటి జగన్మోహన్ రెడ్డి మాటను సైతం దిక్కరించబోతున్నారా..? ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను చూస్తుంటే ఈ విధమైన అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నెల 12వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావలి పర్యటనకు వచ్చారు.. ఈ సందర్భంలోనే గత కొంతకాలంగా ఏడముఖం పెడముఖంగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యే అనిల్, అతని బాబాయ్ , నెల్లూరు డిప్యూటీ మేయర్ పి. రూపకుమార్ యాదవ్ లని కలిపారు. జగన్ స్వయంగా వారిద్దరి చేత చేతుల్లో చేయి వేయించి.. రూపు.. రేపు నెల్లూరులో అనిల్ నీ గెలిపించే భాధ్యత నీదే అని ప్రత్యేకంగా చెప్పారు.. ఆ సమయంలో జగన్ మాటకు ఇద్దరు మౌనంగానే తలాడించారు.
ఇంతవరకు బాగానే ఉంది.. సీఎం అటు వెల్లివెళ్లగానే అనిల్ తన విశ్వ రూపాన్ని బయట పెట్టారు. అవసరమైతే రాజకీయాల్ని వడులుకుంటాగాని అతనితో కలిసే ప్రసక్తే లేదని సన్నిహితుల వద్ద ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. అంటే ఇక్కడ అనిల్ తనకు దైవం లాంటి జగన్ మాటను సైతం ధిక్కరించడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తుంది. కాదు కూడదు అని బలవంతంగా రూపుకుమార్ తో కలిసి పని చేయమంటే పార్టీని వీడడానికి కూడా అనిల్ తెగించి ఉన్నాడనీ టాక్ వినిపిస్తోంది.
ఓవరాల్ గా చెప్పాలంటే ఎవ్వడి మాట వినడు సీతయ్య అనేలా అనిల్ వ్యవహారం ఉంటుంది. రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి కూడా తనకు సహకరించిన వారితోనే అనిల్ పలు సందర్భాల్లో విభేదించారు. 2008 లో ఆయన నెల్లూరులో 20వ డివిజన్ కార్పొరేటర్ గా గెలవడానికి, అలాగే 2009లో తనకు నెల్లూరు సిటీ కాంగ్రెస్ టికెట్ రావడానికి సహకరించిన ఆనం కుటుంబంతో ఆయన అప్పుడే విభేదించారు. వారి పైనే తిరుగుబాటు చేశారు.. వైసీపీలో చేరాక తన రాజకీయ ప్రయాణంలో ఆనం పై తను చేస్తున్న పోరాటానికి తోడుగా నిలిచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తోను ఆయనకు పొసగలేదు. ఇక తాను పోటీ చేసిన అన్ని ఎన్నికలలో అంతా తానై పని చేసిన బాబాయ్ రూపకుమార్ తోనూ గత కొంతకాలంగా విభేదాలున్నాయి.. అవి ఇంకా ముదిరినట్లు కనిపిస్తుంది.
అనుక్షణం తన పంతం నెగ్గించుకోవాలనుకునే అనిల్ తన బాబాయ్ రూపు కుమార్ పై పట్టిన పంతం విషయంలో జగన్ మాటను ఎంత వరకు వింటారనేది అనుమానమే. రూపు విషయంలో అనిల్ అనుసరించే వైఖరిని బట్టే అనిల్ గుండెల్లో జగన్ ఫొటో ఎవరి రూపంలో ఉందనేది అర్థమవుతుందని.. పలువురు పేర్కొంటుండటం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..