Vande Bharat: తిరుపతి ‘వందే భారత్‌’ ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై మొత్తం 16 బోగీలు.. ఎప్పటి నుంచి అంటే..?

Secunderabad-Tirupati Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ట్రైన్ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి..

Vande Bharat: తిరుపతి ‘వందే భారత్‌’ ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై మొత్తం 16 బోగీలు.. ఎప్పటి నుంచి అంటే..?
Vande Bharat Express
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Jyothi Gadda

Updated on: May 15, 2023 | 9:08 AM

Secunderabad-Tirupati Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ట్రైన్ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ రైలులో ప్రస్తుతం 8 కోచ్‌లు ఉండగా, ప్రయాణికుల కోరిక మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి 16 కోచ్‌లను ఏర్పాటు చేయబోతున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇక ఇందులో 14 ఏసీ కోచ్‌లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. అలాగే సీట్ల సంఖ్య 530 నుంచి 1036కి పెరగనుంది.

అయితే ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో 52 సీట్లు, చైర్‌కార్‌లో 478 సీట్లతో మొత్తం 530 సీట్లు ఉన్నాయి. ఈ రైలు ఆక్యుపెన్సీ ఏప్రిల్‌లో 131 శాతంగా నమోదైంది, మే మొదటి పది రోజుల్లో ఆక్యుపెన్సీ 134 శాతంగా ఉందని సమాచారం. అలాగే తిరుపతి నుంచి బయలుదేరిన వందే భారత్ రైలు ఏప్రిల్‌లో 136 శాతం, మే నెలలో 137 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. అంతకముందు ఏప్రిల్ 8న సికింద్రాబాద్ నుంచి ఈ వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే..

ఇవి కూడా చదవండి

వందే భారత్ ట్రైన్ కొత్త టైమింగ్స్..

మరోవైపు ఉదయం 6గంటలకు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి బయల్దేరుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20701) రైలు మే 17 నుంచి ఉదయం 6.15 గంటలకు బయల్దేరేలా అధికారులు మార్పులు చేశారు. అలాగే నల్గొండకు ఉదయం 7.29/7.30 గంటలకు; ఆ తర్వాత గుంటూరుకు 9.35/9.40; ఒంగోలు 11.09/11.10; నెల్లూరు మధ్యాహ్నం 12.29/12.30 గంటలకు వెళ్లి అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలయ్యే సరికి తిరుపతికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాక, తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరే రైలు(20702) నిర్ణీత స్టేషన్లలో ఆగుతూ అదే రోజు రాత్రి 11.30గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. స్థానాలను చేరనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!