IPL 2023: తలపడబోతున్న చెన్నై, కోల్‌కతా.. కీలక మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌లో నైట్ రైడర్స్.. తుది జట్టు వివరాలివే..

CSK vs KKR: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపడనున్నారు. ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని సుస్థిరం..

IPL 2023: తలపడబోతున్న చెన్నై, కోల్‌కతా.. కీలక మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌లో నైట్ రైడర్స్.. తుది జట్టు వివరాలివే..
Csk Vs Kkr
Follow us

|

Updated on: May 14, 2023 | 5:38 AM

CSK vs KKR: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపడనున్నారు. ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. అలాగే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోతే ప్లేఆఫ్స్ మీద ఆశలు వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఎలా అయినా ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని నితీష్ రాణా టీమ్ భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌కి ఉన్న విశేషమేమిటంటే.. ఈ సీజన్‌లో చెన్నై వేదికగా ఆడేందుకు సీఎస్‌కేకి ఇదే చివరి మ్యాచ్. దీంతో హోమ్ గ్రౌండ్‌లో ధోనీని చూసేందుకు చాలా మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.

ఇక ఈ సీజన్‌లో చెన్నై, కోల్‌కతా రెండో సారి తలపడుతున్నాయి. కోల్‌కతా వేదికగా ఏప్రిల్ 23న తలపడిన ఈ టీమ్స్‌లో నితీస్ రాణా టీమ్‌పై చెన్నై జట్టు 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోల్‌కతా నైట్ రైటర్స్ టీమ్ 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమయ్యారు. ఫలితంగా చెన్నై టీమ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించారు.

ప్లేయింగ్ ఎలెవన్ వివరాలివే(అంచనా)..

చెన్నై సూపర్ కింగ్స్: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

ఇవి కూడా చదవండి

కోల్‌కతా నైట్ రైడర్స్: నితీష్ రాణా (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..