AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: వార్నర్‌ సేనపై పంజాబ్ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఢిల్లీ ఔట్..

IPL 2023, DC vs PBKS: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఓడిపోయారు. పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో వార్నర్ సేన విఫలమైంది. దీంతో పంజాబ్ టీమ్ 31 పరుగుల తేడాతో విజయంతో పాటు ఐపీఎల్ ప్లేఆఫ్ అవకాశాలను..

IPL 2023: వార్నర్‌ సేనపై పంజాబ్ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఢిల్లీ ఔట్..
Punjab Kings Won By 31 Runs
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 13, 2023 | 11:42 PM

Share

IPL 2023, DC vs PBKS: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఓడిపోయారు. పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో వార్నర్ సేన విఫలమైంది. దీంతో పంజాబ్ టీమ్ 31  పరుగుల తేడాతో విజయంతో పాటు ఐపీఎల్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అలాగే ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ టీమ్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఇక టార్గెట్ చేధించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కెప్టెన్ డేవిడ్ వార్నర్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఫిలిప్ సాల్ట్ 21 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఓపెనర్లుగా వచ్చిన వీరిద్దరు పెవియన్ చేరిన తర్వాత ఢిల్లీ టీమ్ కష్టాల్లో పడింది. ఈ ఇద్దరి తర్వాత వచ్చినవారెవరు కూడా క్రీజులో నిలబడేందుకు కూడా కష్టపడ్డారు. అయితే చివరిలో అమన్ హకీమ్ ఖాన్(16), ప్రవీణ్ దుబే(16), కుల్దీప్ యాదవ్(10) టార్గెట్‌ను సాధించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దీంతో ఢిల్లీ టీమ్‌కి ఓటమి తప్పలేదు.

ఇక అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ క్రమంలో పంజాబ్ ఓపెనర్, కెప్టెన్ ధావన్ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరినా, మరో ఓపెనర్ ఫ్రభ్‌సిమ్రాన్(103) సెంచరీతో కదం తొక్కాడు. ఆ తర్వాత వచ్చిన వారంతా విఫలమైనప్పటికీ సామ్ కర్రన్(20) పర్వాలేదనిపించాడు. అలాగే పంజాబ్ ఇన్నింగ్స్ చివర్లో సికిందర్ రజా కూడా 11 పరుగులు చేయడంతో టీమ్ స్కోర్ 167కి చేరింది.

కాగా, ఈ విజయంతో పంజాబ్ ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో సీజవంగా ఉంది. ఈ సీజన్‌లో పంజాబ్ టీమ్ మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటిలో కూడా గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు పాయింట్ల పట్టికలో కూడా 6వ  స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌కి ఇది ఆరో విజయం. అలాగే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది 8వ ఓటమి. ఈ సీజన్‌లో ఢిల్లీ 4 మ్యాచ్‌లను మాత్రమే గెలిచింది. దీంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ ఔట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..