MI vs GT: ముంబై తరఫున రోహిత్ శర్మ ‘డబుల్ సెంచరీ’.. ఇంకా ఆ లిస్టులో ధోని, డివిలియర్స్‌ కంటే పైకి..

Rohit Sharma: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 16వ సీజ‌న్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజ‌రాత్ టైటాన్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్(103) అజేయమైన సెంచరీతో కదం తొక్కడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి..

MI vs GT: ముంబై తరఫున రోహిత్ శర్మ ‘డబుల్ సెంచరీ’.. ఇంకా ఆ లిస్టులో ధోని, డివిలియర్స్‌ కంటే పైకి..
Rohit Sharma
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 12, 2023 | 10:20 PM

Rohit Sharma: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 16వ సీజ‌న్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజ‌రాత్ టైటాన్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్(103) అజేయమైన సెంచరీతో కదం తొక్కడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ ముంబై తరఫున 200 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా కూడా అవతరించాడు.

ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ల‌లో డెక్క‌న్ ఛార్జ‌ర్స్‌ తరఫున ఆడిన రోహిత్ శ‌ర్మ మూడు సీజ‌న్ల త‌ర్వాత  2011లో ముంబై ఇండియ‌న్స్‌ టీమ్‌లోకి వచ్చాడు. అప్ప‌టి నుంచి ముంబై త‌రుపున ఆడుతున్న రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా 5 సార్లు ముంబైని టోర్నీ చాంపియన్‌గా నిలిపాడు. ఇక నేటి మ్యాచ్‌లో 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ ఐపీఎల్‌లో  అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు అంతకముందు ఆర్‌సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియ‌ర్స్‌(251) పేరిట ఉండేది. ఇక రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో మొత్తంగా 252 సిక్స్‌లు కొట్టాడు. అలాగే ఈ జాబితాలో ఆర్‌సీబీ మరో మాజీ ఆటగాడు క్రిస్‌గేల్(357) అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అలాగే ఏబీ డివిలియర్స్ ఇప్పుడు 3వ స్థానంలో.. చెన్నై టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోని(239) నాల్గో స్థానంలో ఉన్నాడు

ఇవి కూడా చదవండి

కాగా, ప్రస్తుత మ్యాచ్‌లో 219 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆదిలోనే కష్టాలను ఎదుర్కొంటోంది. 7 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కొల్పోయి 55 పరుగులతో ఉంది. ఇక క్రీజులో గుజరాత్ తరఫున అభినవ్ మనోహర్(2), డేవిడ్ మిల్లర్(10) ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..