DC vs PBKS 1st Innings Highlights: తొలి సెంచరీతో దుమ్మురేపిన ప్రభ్‌సిమ్రన్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
Delhi Capitals vs Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ కొనసాగుతోంది. ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 168 పరుగల టార్గెట్ నిలిచింది.

Delhi Capitals vs Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ కొనసాగుతోంది. ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 168 పరుగల టార్గెట్ నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.
ఈ సీజన్‌లో 5వ సెంచరీ ప్రభ్‌సిమ్రన్ బ్యాట్ నుంచి వచ్చింది. అతని కంటే ముందు ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్ శుక్రవారమే సెంచరీ సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన హ్యారీ బ్రూక్, కోల్‌కతాకు చెందిన వెంకటేష్ అయ్యర్, రాజస్థాన్‌కు చెందిన యశస్వి జైస్వాల్ కూడా టోర్నీలో సెంచరీలు సాధించారు.
శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్‌ల వికెట్లను ఇషాంత్ శర్మ పడగొట్టగా.. ధావన్ 7, లివింగ్‌స్టోన్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జితేష్ శర్మ (5) అవుటయ్యాడు. ప్రవీణ్ దూబే సామ్ కరన్ (20) వికెట్ తీశాడు.




61 బంతుల్లో ప్రభ్‌సిమ్రన్ సెంచరీ..
పంజాబ్ తరపున ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 61 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ప్రభ్‌సిమ్రాన్ 65 బంతుల్లో 158.46 స్ట్రైక్ రేట్‌తో 103 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్‌లు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




