Video: పాపం! కావ్య పాప.. అప్పుడు 344 పరుగులు చేసినా వద్దంది.. కట్‌చేస్తే.. 13 బంతుల్లోనే కన్నీళ్లు పెట్టించిన మాజీ ప్లేయర్..
SRH vs LSG, Nicholas Pooran: నికోలస్ పూరన్ హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాడు. 13 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.

ఐపీఎల్ 2023లో భాగంగా 58వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం లక్నో జట్టు 19.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో LSGకి ఇది ఆరో విజయం. నికోలస్ పూరన్, ప్రేరక్ మార్కండ్ LSG విజయంలో కీలక పాత్రలు పోషించారు. వీరిద్దరి భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు విజయాన్ని దూరం చేసింది.
హైదరాబాద్‌పై నికోలస్ పూరన్ బీభత్సం సృష్టించాడు. 13 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో పూరన్ 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 338 స్ట్రైక్ రేట్‌తో పరుగుల వర్షం కురిపించాడు.




?????? ?????!
Relive the three sixes from @nicholas_47 that changed it all ???#TATAIPL | #SRHvLSG https://t.co/T3IyHw8HbI pic.twitter.com/bG6Hz6mQBr
— IndianPremierLeague (@IPL) May 13, 2023
ప్రేరక్ మార్కండ్ నుంచి అతనికి పూర్తి మద్దతు లభించింది. మార్కండ్ 45 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 23 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం కారణంగా ఒక్కసారిగా మ్యాచ్‌లో పటిష్టంగా కనిపిస్తున్న హైదరాబాద్ ఓటమిపాలైంది. మరో 4 బంతులు మిగిలి ఉండగానే లక్నో విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
