Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ గుట్టురట్టు.. అక్కడి సీన్ చూసి పోలీసులే షాక్..!
చిన్న నోట్ల నుంచి పెద్దనోట్ల వరకు కలర్ జిరాక్స్ తీసినంత ఈజీగా ప్రింట్ చేసేస్తోంది ఓ ముఠా. అనకాపల్లి టూ హైదరాబాద్ కేంద్రంగా నకిలీనోట్లను చలామని లోకి తెచ్చింది. ఫర్జీ వెబ్ సిరీస్ తరహాలో నకిలీ నోట్ల తయారీ చేస్తున్న అంతర్రాష్ట ముఠా గుట్టురట్టు చేశారు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి.. దీని వెనుక ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని నర్సీపట్నంలో నకిటీ నోట్లను తయారు చేసి.. శంషాబాద్ కేంద్రంగా సర్క్యూలేట్ చేస్తోంది గ్యాంగ్. విషయం తెలుసుకున్న పోలీసులు.. నకిలీ కరెన్సీ ప్రింటింగ్ స్థావరాలపై దాడులు చేశారు. ఇద్దురు కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి రూ.11 లక్షల నకిలీ కరెన్సీ, తయారీ మెషీన్ల స్వాధీనం చేసుకున్నారు. రూ.50, 100, 200, 500 నోట్లు ప్రింట్ చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ నోట్ల తయారిలో కలర్స్, బాండ్ పేపర్, ప్రింటర్లను వినియోగించారు కేటుగాళ్లు. రద్దీగా ఉండే షాపుల్లో ఈ నకిలీ నోట్లను మారుస్తున్నారు. వీటిని మార్చేందుకు ఏజెంట్లకు 1:3 నిష్పత్తిలో పంపకాలు చేస్తోంది ముఠా.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..