Telangana: తగ్గేదేలే అంటున్న పొంగులేటి.. మొన్న ఖమ్మం.. ఇప్పుడు పాలమూరు..
ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇప్పట్నుంచి మరో లెక్క అంటున్నారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. కేసీఆర్ వ్యతిరేకుల్ని ఏకం చేయడానికి రాష్ట్రమంతా పర్యటిస్తామని చెప్పారు. కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడమే తమందరి లక్ష్యమన్నారు. అయితే, ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతామన్నారు పొంగులేటి. సేవ్ వనపర్తి పేరుతో మంత్రి నిరంజన్‌రెడ్డి ఇలాఖాలో సమరశంఖం పూరించిన పొంగులేటి..
ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇప్పట్నుంచి మరో లెక్క అంటున్నారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. కేసీఆర్ వ్యతిరేకుల్ని ఏకం చేయడానికి రాష్ట్రమంతా పర్యటిస్తామని చెప్పారు. కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడమే తమందరి లక్ష్యమన్నారు. అయితే, ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతామన్నారు పొంగులేటి. సేవ్ వనపర్తి పేరుతో మంత్రి నిరంజన్‌రెడ్డి ఇలాఖాలో సమరశంఖం పూరించిన పొంగులేటి.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి తీరుతామంటూ శపథం చేశారు
ఆత్మీయ సమ్మేళనం.. ఈ ఒకే ఒక్క నినాదంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకూ ఒక్క ఖమ్మమే అనుకుంటే, ఇప్పుడు స్టేట్ మొత్తం తిరిగేస్తూ రాజకీయ సెగ పుట్టిస్తున్నారు.
ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క అనేలా పొంగులేటి నోటి నుంచి డైలాగ్ వచ్చింది. ఉమ్మడి ఖమ్మం ఒక్కటే కాదు.. స్టేట్ మొత్తం ఫోకస్ పెడుతున్నట్టు చెప్పారు. కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడానికి బీఆర్ఎస్ బాధితులందర్నీ ఒకే వేదికపై తెస్తామంటున్నారు పొంగులేటి.
మంత్రి నిరంజన్‌రెడ్డి టార్గెట్‌గా ఈ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. నిరంజన్‌రెడ్డికి వ్యతిరేకంగా పదవులకు రాజీనామా చేసిన జెడ్పీ ఛైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి కలిసి ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ ముగ్గురూ పొంగులేటి, జూపల్లితో చేతులు కలిపి బీఆర్ఎస్‌పై యుద్ధం ప్రకటించారు.
తమ అందర్నీ ఒకటే లక్ష్యం, ఒకటే ఆశయం.. అదే బీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించడం అన్నారు పొంగులేటి అండ్ జూపల్లి. అందుకోసం రాష్ట్రమంతటా తిరగనున్నట్టు చెప్పారు. ఏ పార్టీలో చేరతామనేది త్వరలోనే చెబుతామన్నారు. అయితే, కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపించగలిగే పార్టీలోనే చేరతామంటూ క్లారిటీ ఇచ్చారు పొంగులేటి అండ్ జూపల్లి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..