AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాషాయమయమైన కరీంనగర్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన హిమంత బిశ్వశర్మ..

జై హనుమాన్‌ నినాదాలతో మార్మోగిపోయింది కరీంనగర్‌. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏక్తా యాత్రలో వేలాదిమంది యువత కదం తొక్కారు. చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ.. సంచలన కామెంట్స్‌ చేశారు. తెలంగాణలో రజాకార్‌ రాజ్యం అంతమై.. రామరాజ్యం రాబోతున్నట్టు చెప్పారు.

Telangana: కాషాయమయమైన కరీంనగర్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన హిమంత బిశ్వశర్మ..
Hindu Ekta Rally
Shiva Prajapati
|

Updated on: May 14, 2023 | 9:27 PM

Share

జై హనుమాన్‌ నినాదాలతో మార్మోగిపోయింది కరీంనగర్‌. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏక్తా యాత్రలో వేలాదిమంది యువత కదం తొక్కారు. చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ.. సంచలన కామెంట్స్‌ చేశారు. తెలంగాణలో రజాకార్‌ రాజ్యం అంతమై.. రామరాజ్యం రాబోతున్నట్టు చెప్పారు.

కాషాయమయమైన కరీంనగర్‌..

కరీంనగర్‌.. కాషాయమయమైంది. పట్టణంలో ఎటుచూసినా కాషాయ రంగే కనిపించింది. ప్రధాన రహదారుల్లో హనుమాన్‌ జెండాలు రెపరెపలాడాయ్‌. వేలాదిమంది హిందువులు కదం తొక్కడంతో జన సముద్రాన్ని తలపించింది కరీంనగర్‌.

హనుమాన్‌ జయంతి సందర్భంగా టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ఏక్తా యాత్ర జరిగింది. కరీంనగర్‌ వైశ్యభవన్‌ నుంచి మొదలైన యాత్ర.. టవర్ సర్కిల్‌, కమాన్‌, తెలంగాణ చౌక్‌, కోర్టు చౌరస్తా, గాంధీరోడ్‌ మీదుగా సాగింది. దారి పొడవునా డప్పు దరువులతో అలరించారు కళాకారులు.

ఇవి కూడా చదవండి

అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ ముఖ్య అతిథులుగా హాజరై ఏక్తా యాత్రలో పాల్గొన్నారు. కాషాయ జెండాలు చేతబూని కిలోమీటర్ల పొడవునా నడిచారు భక్తులు. ఏక్తా యాత్రలో భారీ హనుమాన్ విగ్రహం, కాషాయ జెండాలు, ది కేరళ స్టోరీ చిత్ర యూనిట్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాయ్‌. హిందువుల్లో చైతన్యం నింపడానికే ఏక్తా యాత్ర నిర్వహించినట్టు చెప్పారు బండి సంజయ్‌. హిందూత్వ అజెండా, అభివృద్ధి నినాదంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామన్నారు.

తెలంగాణలో రామరాజ్యం కన్ఫామ్..

‘తెలంగాణలో రజాకార్ రాజ్యం అంతమవడం ఖాయం.. రామరాజ్యం రావడం కన్ఫామ్’.. అని అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. తెలంగాణలో రామరాజ్య స్థాపనే బీజేపీ లక్ష్యం అని పేర్కొన్నారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్ ఒక్కటే అని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వారి అభీష్టం మేరకు రాష్ట్రంలో రామరాజ్యం వస్తుందన్నారు హిమంత బిశ్వశర్మ.

పటిష్టమైన భద్రత..

కాగా, ఏక్తా యాత్రకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు పోలీసులు. కాషాయ జెండాలతోపాటు అడుగడుగునా ఖాకీలు కనిపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దాంతో, కాషాయ జెండాలతోపాటు ఖాకీల యూనిఫామ్‌ కూడా హైలేట్‌ అయ్యింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..