Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bumper Offer: త్వరపడండి..! శాంసంగ్ కొత్త ఫోన్‌పై ఏకంగా రూ.35 వేల తగ్గింపు.. ఆకర్షణీయమైన లుక్- అద్దిరిపోయే ఫీచర్లు..

Samsung Galaxy S22: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను విడుదల చేసే శాంసగ్ ఫోన్‌పై అద్దిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. శాంసంగ్ Galaxy S22 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై..

Bumper Offer: త్వరపడండి..! శాంసంగ్ కొత్త ఫోన్‌పై ఏకంగా రూ.35 వేల తగ్గింపు.. ఆకర్షణీయమైన లుక్- అద్దిరిపోయే ఫీచర్లు..
Samsung Galaxy S22
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 15, 2023 | 7:20 AM

Samsung Galaxy S22: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను విడుదల చేసే శాంసగ్ ఫోన్‌పై అద్దిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. శాంసంగ్ Galaxy S22 స్మార్ట్‌ఫోన్  కొనుగోలుపై 40 శాతం భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.85,999. అయితే, దీన్ని కొనుగోలు చేయడానికి అంత డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. అవును, ఫ్లిప్‌కార్ట్‌లోని ఆఫర్‌ని ఉపయోగించుకోవడం ద్వారా మీరు ఈ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆ ఆఫర్ వివరాలేమిటో ఇప్పుడే చూద్దాం..

ముందుగా చెప్పినట్లు Samsung Galaxy S22 అసలు ధర రూ. 85,999. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 50,990 లకే మీరు ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అంటే నేరుగా రూ.34,676 సేవ్ చేసుకోవచ్చు. ఇదే కాక ఈ ఫోన్ కొనుగోలుపై ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy S22 కొనుగోలు కోసం Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10% క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. అలాగే IndusInd బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10 శాతం తగ్గింపుతో రూ. 1,000 వరకు ఆదా అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కూడా 5 శాతం తగ్గింపును పొందుతోంది.

Samsung Galaxy S22 5G: స్పెసిఫికేషన్‌లు

డిస్ప్లే: Samsung Galaxy S22 6.1 అంగుళాల డైనమిక్ AMOLED ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది 1080 x 2340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ని పొందుతుంది.

ఇవి కూడా చదవండి

చిప్‌సెట్, OS: ఈ Samsung Galaxy S22 ఫోన్‌లో ఆక్టా కోర్ చిప్‌సెట్ సపోర్ట్ చేయబడింది. అంతే కాకుండా, S22 మోడల్ స్మార్ట్‌ఫోన్ 5G Android 12 OS పై పనిచేస్తుంది.

కెమెరా: కెమెరా ఫీచర్ల గురించి మాట్లాడాలంటే ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 50MP + 12MP + 10MP వెనుక కెమెరాలను పొందుతుంది. ఇంకా వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 10MP ఫ్రంట్ కెమెరా ఉంది.

స్టోరేజ్: Galaxy S22లో 8GB RAM, ఇంటర్నెల్ మెమోరీ 128GB ఉన్నాయి.

బ్యాటరీ: బ్యాటరీ బ్యాకప్ కోసం ఈ ఫోన్‌లో 3700 mAh Li-ion బ్యాటరీ అందించబడింది. అదే సమయంలో 45W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు కూడా అందుబాటులో ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..