Cyclone Mocha: బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీర ప్రాంతాల్లో ‘మోచా తుఫాన్’ అల్లకల్లోలం.. అప్రమత్తంగా వెస్ట్ బెంగాల్..

Cyclone Mocha: మోచా తుపాను బంగ్లాదేశ్‌, మయన్మార్‌లను వణికిస్తోంది. 210 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుపాను బంగ్లాదేశ్, మయన్మార్ల మధ్య మోచా తుపాను తీరాన్ని..

Cyclone Mocha: బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీర ప్రాంతాల్లో ‘మోచా తుఫాన్’ అల్లకల్లోలం.. అప్రమత్తంగా వెస్ట్ బెంగాల్..
Cyclone Mocha
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 14, 2023 | 11:02 PM

Cyclone Mocha: మోచా తుపాను బంగ్లాదేశ్‌, మయన్మార్‌లను వణికిస్తోంది. 210 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుపాను బంగ్లాదేశ్, మయన్మార్ల మధ్య మోచా తుపాను తీరాన్ని దాటింది. వేగంగా దూసుకొస్తూ.. బంగ్లాదేశ్‌, మయన్మార్‌లను షేక్‌ చేస్తోంది. గంటకు గరిష్ఠంగా 180, 190 నుంచి 210 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. దాంతో.. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మోచా.. ఐదో కేటగిరి తుపానుగా రూపుదాల్చడంతో బంగ్లాదేశ్‌, మయన్మార్‌ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

మరోవైపు ఇప్పటికే దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తీరప్రాంతాల సమీపంలోని విమానాశ్రయాలను మూసివేశాయి. బంగ్లాదేశ్‌లో ప్రజల కోసం 1,500 తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. బంగ్లాలో రోహింగ్యాలు నివసిస్తున్న, ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరం ‘కాక్స్ బజార్‌’కు తుపాను ముప్పు పొంచి ఉందని అధికారులు వెల్లడించారు. దాదాపు రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్‌ ఎదుర్కొంటున్న అత్యంత శక్తిమంతమైన తుపాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అంతకుముందు.. 2007లో వచ్చిన తుపాను ధాటికి బంగ్లాదేశ్‌లో మూడు వేల మందికిపైగా మృతి చెందారు. బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లింది.

అయితే వాస్తవానికి.. మొదట మోచా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై ఉంటుందని అధికారులు భావించారు. కానీ.. తుపానుగా మారిన తర్వాత దిశను మార్చుకుంది. బంగ్లాదేశ్‌, మయాన్మార్‌ సరిహద్దుల్లోని తీరం దాటింది. ఇక.. మోచా తుపాను విరుచుకుపడుతుండటంతో పశ్చిమ బెంగాల్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!