Karnataka CM Post: సీఎం షేరింగ్‌కు ఓకే చెప్పిన సిద్ధూ.. తిరస్కరించిన డీకే.. కర్ణాటక సీఎల్పీ భేటీలో హైడ్రామా..

కర్నాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌కు సీఎం ఎంపిక మాత్రం పెద్ద తలనొప్పిగా మారింది. సీఎం పదవి కోసం డీకే శివకుమార్‌, సిద్దరామయ్య మధ్య గట్టి పోటీ ఉంది. బెంగళూర్‌ లోని షాంగ్రిలా హోటల్‌లో జరిగిన సీఎల్పీ భేటీకి అధిష్టానం దూతగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే హాజరయ్యారు.

Karnataka CM Post: సీఎం షేరింగ్‌కు ఓకే చెప్పిన సిద్ధూ.. తిరస్కరించిన డీకే.. కర్ణాటక సీఎల్పీ భేటీలో హైడ్రామా..
Siddaramaiah, Shivakumar
Follow us

|

Updated on: May 14, 2023 | 9:16 PM

కర్నాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌కు సీఎం ఎంపిక మాత్రం పెద్ద తలనొప్పిగా మారింది. సీఎం పదవి కోసం డీకే శివకుమార్‌, సిద్దరామయ్య మధ్య గట్టి పోటీ ఉంది. బెంగళూర్‌ లోని షాంగ్రిలా హోటల్‌లో జరిగిన సీఎల్పీ భేటీకి అధిష్టానం దూతగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే హాజరయ్యారు. హోటల్‌ బయట అటు సిద్దరామయ్య మద్దతుదారులు, ఇటు డీకే శివకుమార్‌ మద్దతుదారులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో 135 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని షిండేతో పాటు మరో ఇద్దరు పరిశీలకులు సేకరించారు. ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ రణదీప్‌ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఎమ్మెల్యేల అభిప్రాయాలను హైకమాండ్‌ దూతలు సేకరించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానమే ప్రకటించాలని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ఏకవాక్య తీర్మానం చేశారు. దీంతో ముఖ్యమంత్రి విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని అబ్జర్వర్లు నిర్ణయించారు. కాంగ్రెస్ చీఫ్ ప్రకటించే అభ్యర్థికి కట్టుబడి ఉండాలని వేణుగోపాల్ తెలిపారు.

ఈ క్రమంలో కేసీ వేణుగోపాల్ శివకుమార్, సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఇద్దరు 50-50 షేరింగ్.. చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండే ప్రతిపాదనను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇద్దరు నేతల దృష్టికి తీసుకువచ్చారు. అయితే, చెరో రెండున్నరేళ్ల ప్రతిపాదనను డీకే శివకుమార్ తిరస్కరించగా.. సిద్ధరామయ్య తాను అనుకూలమని ప్రకటించారు. దీంతో ఇద్దరి విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సీఎం పంచాయితీ.. ఢిల్లీకి చేరడంతో అధిష్టానం సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో భేటీకానుంది. దీనిపై రేపటికల్లా క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..