CSK vs KKR: ధోని సేనపై కోల్‌కతా విజయం.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన రాణా, రింకూ.. ప్లేఆఫ్స్‌‌పై ఇంకా సస్పెన్స్..

CSK vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడం వల్ల ప్లేఆఫ్స్‌లో ఇంకా ఆ టీమ్ బెర్త్ కన్ఫర్మ్..

CSK vs KKR: ధోని సేనపై కోల్‌కతా విజయం.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన రాణా, రింకూ.. ప్లేఆఫ్స్‌‌పై ఇంకా సస్పెన్స్..
Csk Vs Kkr
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 14, 2023 | 11:50 PM

CSK vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ  మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడం వల్ల ప్లేఆఫ్స్‌లో ఇంకా ఆ టీమ్ బెర్త్ కన్ఫర్మ్ కాలేదు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ధోని నేతృత్వంలోని చెన్నై టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగుల తక్కువ స్కోర్‌నే చేయగలిగింది. దీంతో 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ తొలుత తడబడినా విజయం సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో నైట్ రైడర్స్ తరఫున నితీష్ రాణా(57, నాటౌట్), రింకూ సింగ్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక చెన్నై బౌలర్లో దీపక్ చాహర్ మాత్రమే 3 వికెట్లు తీసుకున్నాడు.

అయితే నేటి గెలుపుతో కోల్‌కతా టీమ్ ఖాతాలో మరో విజయం చేరినట్లయింది, కానీ ప్లేఆఫ్స్‌లో నైట్‌రైడర్స్ ఉంటుందా అంటే అనుమానమే అన్నట్లుగా ఉంది టోర్నీలోని పరిస్థితి. అలాగే చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తన చివరి మ్యాచ్‌లో అయినా విజయం సాధించాలి. ఈ క్రమంలో ప్లేఆఫ్స్‌లో చెన్నై స్థానం పొందగలుగుతుందా లేదా అనే సస్పెన్స్ ఇప్పుడు నెలకొంది.

ఇవి కూడా చదవండి

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 17, డెవాన్ కాన్వే 30 తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. అనంతంర వచ్చిన వారిలో శివమ్ దుబే 48 (నాటౌట్) రాణించినా.. రహానే 16, జడేజా 20 కూడా తక్కువ పరుగులే చేయగలిగారు. ఇక చివర్లో వచ్చిన ధోని 3 బంతుల్లో రెండే పరుగులు చేసి అజేయంగా చెన్నై ఇన్నింగ్స్ ముగించాడు. మరోవైపు కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో రెండు, శార్ధుల్ ఠాకూర్, వైభవ్ అరోరా తలో వికెట్ తీసుకున్నారు.

ఇరుజట్ల వివరాలు..:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), జాసన్ రాయ్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కెప్టెన్/కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!