Shani Jayanti 2023: 4 రోజుల్లో శని జయంతి.. ఈ రాశులపై శుభ ఫలితాలు.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

Shani Jayanti 2023: సనాతన హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం.. శని దేవుడు రాశిచక్రంలోని అన్ని రాశులపై కూడా తన ప్రభావాన్నికలిగి ఉంటాడు. అలాంటి శని భగవానుడి పుట్టినరోజు ఈ నెలలోనే అంటే మే 19న వచ్చింది. సాధారణంగా శని జయంతిని శని అమావాస్యగా..

Shani Jayanti 2023: 4 రోజుల్లో శని జయంతి.. ఈ రాశులపై శుభ ఫలితాలు.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
Shani Jayanti 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 15, 2023 | 6:00 AM

Shani Jayanti 2023: సనాతన హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం.. శని దేవుడు రాశిచక్రంలోని అన్ని రాశులపై కూడా తన ప్రభావాన్నికలిగి ఉంటాడు. అలాంటి శని భగవానుడి పుట్టినరోజు ఈ నెలలోనే అంటే మే 19న వచ్చింది. సాధారణంగా శని జయంతిని శని అమావాస్యగా జరుపుకుంటారు. ఇక శని జయంతి రోజున నిష్ఠగా ఆచార సంప్రదాయాలను పాటించి పూజించేవారిపై శనిదేవుడు సానుకూల ప్రభావాన్ని చూపుతున్నారు. వారికి సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించేలా చేస్తాడు. జోతిష్య నిపుణుల ప్రకారం ఈ ఏడాది శనిదేవుడు తన జయంతి తర్వాత మూడు రాశులపై శుభ ప్రభవాలను చూపబోతున్నాడు. అలాగే శనిజయంతికి ముందే చంద్రుడు, బృహస్పతి కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ క్రమంలో ఆయా రాశులకు చెందిన వారు కోటేశ్వరులుగా అవతరిస్తారని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ అదృష్టవంతమైన రాశులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మిథున రాశి: గజకేసరి రాజయోగం ప్రభావం మిథునరాశి వారిపై ఎక్కువగా కనిపిస్తుంది. సమాజంలో ఈ రాశివారికి గౌరవమర్యాదలు పెరుగుతాయి. కష్టానికి తగిన ఫలితాలు, కొత్త ఉద్యోగం అందుకోవడంతో పాటు అస్తి కొనుగోళ్లు చేస్తారు. ఇక ఈ రాశివారిపై శని దేవుడి కృప ఉండనుంది.

మేష రాశి: శని జయంతికి ముందు ఏర్పడే గజకేసరి యోగం కారణంగా మేషరాశి వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఈ రాశివారికి ఫ్యామిలీ లైఫ్ బాగుండడంతో పాటు సంపద రెట్టింపు అవుతుంది. నిరుద్యోగులకు ఉపాధి, ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

తుల రాశి: తుల రాశికి అధిపతి ఎవరంటే.. శనిదేవుడినికి ప్రియ స్నేహితుడైన శుక్రుడు. ఫలితంగా తులరాశిలో శనిదేవుడు ఉచ్ఛ స్థితిలో ఉంటాడు. అంతేకాకుండా శని అనుగ్రహం తులరాశి వారిపై నిండుగా ఉంటుంది. ఇంకా గజకేసరి రాజయోగంలో శనిదేవుడిని పూజించడం వల్ల తులరాశి వారు ఊహించనంతగా సిరిసంపదలను పొందుతారు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..