Marriage Astro Tips: మీకు ఏ రాశికి చెందిన జీవిత భాగస్వామి మంచిది.. ఆయా రాశులకు వివాహ పొంతనలు..
Marriage Astro Tips: సాధారణంగా నక్షత్రాలను బట్టి జాతకంలోని గ్రహాల స్థితి గతులను బట్టి వివాహ సంబంధమైన పొంతనలను చూడడం జరుగుతూ ఉంటుంది. అయితే, కొద్దికాలం క్రితం వరకు కోణాలను బట్టి కేంద్రాలను బట్టి పొంతన చూడటం జరుగుతూ ఉండేది. ఇప్పటికి కూడా దేశంలోని అనేక ప్రాంతాలలో ఈ విధంగానే పొంతన చూడటం జరుగుతోంది.
సాధారణంగా నక్షత్రాలను బట్టి జాతకంలోని గ్రహాల స్థితి గతులను బట్టి వివాహ సంబంధమైన పొంతనలను చూడడం జరుగుతూ ఉంటుంది. అయితే, కొద్దికాలం క్రితం వరకు కోణాలను బట్టి కేంద్రాలను బట్టి పొంతన చూడటం జరుగుతూ ఉండేది. ఇప్పటికి కూడా దేశంలోని అనేక ప్రాంతాలలో ఈ విధంగానే పొంతన చూడటం జరుగుతోంది. పాశ్చాత్య దేశాలలో సైతం ఈ విధంగా కోణాల ప్రకారం, కేంద్రాల ప్రకారం పొంతన చూడటం ప్రారంభం అయింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం కోణం అంటే చంద్రుడు ఉన్న రాశికి ఒకటి, ఐదు, తొమ్మిది స్థానాలు. కేంద్ర స్థానాలంటే ఒకటి, నాలుగు, పది స్థానాలు. మీ రాశి మేషం అయ్యే పక్షంలో మీకు సింహం, ధను రాశి వారితో పొంతన బాగా కుదురుతుంది. అదేవిధంగా మీ రాశి మేషం అయ్యే పక్షంలో దానికి కేంద్ర రాశి అయిన కర్కాటకం లేదా మకర రాశులు వివాహ సంబంధానికి అనుకూలంగా ఉంటాయి.
- మేషం, సింహం, ధనుస్సు(కోణ రాశులు): ఈ రాశుల వారి మధ్య వివాహ సంబంధం కుదిరే పక్షంలో స్వార్థం లేని దాంపత్య జీవితం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవించడం జరుగుతుంది. సాధారణంగా ఇది దైవం కుదర్చిన సంబంధం గా కొనసాగుతుంది. దాంపత్య జీవితం లేదా వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగటానికి, సత్సంతానం కలగటానికి, సుఖ సంతోషాలను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వివాహ సంబంధం లేదా వివాహ పొంతన విషయంలో ఎక్కువగా కోణాలకు ప్రాధాన్యం ఇవ్వటం మంచిది.
- మేషం, కర్కాటకం, మకరం(కేంద్ర రాశులు): కేంద్ర రాశుల విషయానికి వచ్చేసరికి మేష రాశి వారికి కర్కాటకం లేదా మకర రాశితో వివాహ పొంతన సుఖప్రదంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. సాధారణంగా కేంద్ర రాశుల మధ్య వివాహ పొంతన పరస్పర ఆధార సంబంధంగా కొనసాగుతుంది. అంటే ఒకరి అవసరం మరొకరికి ఉండటం వల్ల వివాహ బంధం కొనసాగుతుందన్న మాట. భార్యాభర్తల మధ్య ఎప్పుడో తప్ప అభిప్రాయ బేధాలు తలెత్తే అవకాశం ఉండదు. ఇది పూర్తిగా మానవ సంబంధమైన సంబంధాలు అయి ఉంటాయి. మనుషుల ప్రవృత్తి ఈ సంబంధాల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది.
- వృషభం, కన్య, మకరం(కోణ రాశులు): ఈ మూడు రాశులు ఒకదానికొకటి కోణ రాశుల్లో ఉన్నందువల్ల సాధారణంగా ఈ రాశుల వారి మధ్య వివాహ బంధం పటిష్టంగా ప్రశాంతంగా కొనసాగటానికి అవకాశం ఉంటుంది. వీరి మనస్తత్వం చాలావరకు సరిపోతుంది. ఇటువంటి పొంతనలను, వివాహ బంధాలను దైవం కుదర్చిన బంధాలుగా పరిగణించవచ్చు. వీరి మధ్య దాంపత్య జీవితం కలకాలం సుఖప్రదంగా సాగిపోతుంది. మంచి సంతానం లేదా ఆరోగ్యవంతమైన సంతానం కలిగే అవకాశం ఉంటుంది.
- వృషభం, సింహం, కుంభం (కేంద్ర రాశులు): ఈ మూడు రాశులు ఒకదానికొకటి కేంద్ర రాశులు. ఈ రాశుల మధ్య వివాహ పొంతన కుదిరే పక్షంలో వీరి దాంపత్య జీవితం పరస్పర ఆధారంగా కొనసాగుతుంది. మధ్య మధ్య సమస్యలు తలెత్తినప్పటికీ మొత్తం మీద దాంపత్య జీవితానికి పెద్దగా భంగం ఏమి ఉండదు. వివాహ బంధంలో కొద్దిగా స్వార్థం, స్వప్రయోజనం ఉండే అవకాశం ఉంది. ఈ ప్రయోజనాలు నెరవేరుతున్నంతకాలం ఈ రాశుల మధ్య సంబంధాలకు వచ్చిన నష్టమేమీ ఉండదు.
- మిథునం, తుల, కుంభం (కోణ రాశులు): ఈ రాశుల మధ్య వివాహ సంబంధాలు ఆశించిన సత్ఫలితాలను ఇస్తాయి. వివాహ బంధం కలకాలం సామరస్యంగా సాగిపోతుంది. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా దంపతులు వ్యవహరించడం జరుగుతుంది. దైవానుగ్రహం లేనిదే ఇటువంటి సంబంధం ఏర్పడే అవకాశం ఉండదు. వీరికి తప్పకుండా సత్సంతానం కలుగుతుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మనస్తత్వాలు చాలావరకు సరిపోతాయి. సాధారణంగా దంపతులు ఒకే మాట మీద నిలబడటం జరుగుతుంది.
- మిథునం, కన్య, మీనం (కేంద్ర రాశులు): ఈ రాశుల మధ్య పొంతన కూడా చాలా వరకు విజయవంతం అవుతుంది. అయితే ఈ రాశుల మధ్య వివాహం అవసరార్థం లేదా ఏదో ప్రయోజనం ఆశించి జరగటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇద్దరికీ ఉద్యోగం ఉండటం, ఇద్దరికీ వ్యక్తిగతంగా ఒకే రకమైన సమస్య ఉండటం వంటివి కారణం అవుతూ ఉంటాయి. దంపతులు తరచూ రాజీ పడటం, సర్దుకుపోవటం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద వీరి వివాహ బంధానికి పెద్దగా సమస్యలు ఉండే అవకాశం లేదు.
- కర్కాటకం, వృశ్చికం, మీనం (కోణ రాశులు): ఈ రాశుల మధ్య వివాహ సంబంధం కుదరటం అనేక విధాలుగా చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతోంది. ఈ రాశుల మధ్య వివాహం జరగటం అనేది పూర్తిగా దైవికం అని చెప్పవచ్చు. దాంపత్య జీవితానికి సంబంధించిన అంతవరకు ఈ రాశుల వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు. మనస్తత్వాలు చాలావరకు ఒకే విధంగా ఉంటాయి. విభేదాలు లేదా పొర పచ్చాలు తలెత్తడం చాలా తక్కువ. అత్యధిక శాతం దంపతులు ఒకే మాట మీద నిలబడటం జరుగుతుంది. ఒకరినొకరు గౌరవించుకోవడం, విలువనివ్వటం సాధారణ విషయంగా ఉంటుంది.
- కర్కాటకం, తుల, మేషం (కేంద్ర రాశులు): సాధారణంగా ఈ రాశుల మధ్య వివాహ సంబంధం కుదరటానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. ఎక్కువగా ఉద్యోగం, డబ్బు, హోదా వంటివి కారణం అవుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రేమ జీవితానికి కూడా వర్తిస్తాయని అర్థం చేసుకోవాలి. దంపతుల మధ్య ఏదో ఒక స్వప్రయోజనం గట్టి బంధంగా నిలుస్తుంది. ఈ కారణంగానే వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఈ రాశులకు సంబంధించిన దంపతులు ఎక్కువగా తమ మనసులోని భావాలను ఇతరులతో పంచుకోవడం జరగదు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..