Education Astrology: విద్యార్థి జీవితానికి గ్రహాల గైడెన్స్.. ఆ రాశులకు చెందిన స్టూడెంట్స్‌కి ఇక తిరుగులేదు..

పరీక్షలు జరగటం, ఫలితాలు వెలువడటం పూర్తయినందువల్ల ఇక విద్యార్థులు వారి తల్లిదండ్రుల దృష్టి ఉన్నత చదువుల మీద పడుతుంది. ఏ ఏ రాశుల విద్యార్థులు ఏ ఏ చదువులకు వెళ్ళటం వల్ల ఉపయోగం ఉంటుంది..

Education Astrology: విద్యార్థి జీవితానికి గ్రహాల గైడెన్స్.. ఆ రాశులకు చెందిన స్టూడెంట్స్‌కి ఇక తిరుగులేదు..
Education Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 12, 2023 | 6:52 PM

పరీక్షలు జరగటం, ఫలితాలు వెలువడటం పూర్తయినందువల్ల ఇక విద్యార్థులు వారి తల్లిదండ్రుల దృష్టి ఉన్నత చదువుల మీద పడుతుంది. ఏ ఏ రాశుల విద్యార్థులు ఏ ఏ చదువులకు వెళ్ళటం వల్ల ఉపయోగం ఉంటుంది, ఏ గ్రహాలు ఏ రాశులకు అనుకూలంగా ఉండబోతున్నాయి అనే విషయాలను ఇక్కడ పరిశీలిద్దాం. జ్ఞానానికి ఉన్నత విద్యలకు గురు గ్రహం కారకుడు కాగా చదువులకు వివేకానికి బుధుడు కారకుడు. ఈ రెండు గ్రహాల స్థితి గతులను బట్టి ఉన్నత విద్య గురించి చెప్పాల్సి ఉంటుంది. మరి 12 రాశులకు చెందిన విద్యార్థులకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..

మేష రాశి: ఈ రాశిలో ప్రస్తుతం సంచరిస్తున్న గురు బుధ గ్రహాల వల్ల తప్పకుండా ఉన్నత విద్యకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కామర్స్, అకౌంటెన్సీ, గణితం, టెక్నాలజీ, పరిశోధనలు వంటి రంగాలలో విద్యార్థులు అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది. అంతేకాక దూర ప్రాంతాలలో లేదా విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే సూచనలు కూడా ఉన్నాయి. కొద్దిపాటి ప్రయత్నంతో వీరు ఎటువంటి పరీక్షలనైనా ఎదుర్కోగల స్థితిలో ఉంటారు. పోటీ పరీక్షలలో ఘన విజయం సాధించడం తథ్యం అని చెప్పవచ్చు.

వృషభ రాశి: ఈ రాశి వారు ఉన్నత విద్య కోసం కాస్తంత ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది. సాధారణంగా ఉన్నత విద్య కోసం తప్పనిసరిగా దూరప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. సైన్స్ అకౌంటెన్సీ బ్యాంకింగ్ వంటి కోర్సులకు వెళ్లే అవకాశం ఉంది. ఈ అంశాలలో ఈ రాశి వారు తప్పకుండా ఉత్తీర్ణులు అయ్యే సూచనలు ఉన్నాయి. పోటీ పరీక్షలలో కొద్దిగా ఇబ్బంది పడటం జరగవచ్చు. ఈ రాశికి ముందు, వెనక గురు, బుధ, శుక్రుల వంటి వంటి శుభ గ్రహాలు సంచరించడం వల్ల తప్పకుండా శుభవార్తలు వినడం జరుగుతుంది.

మిథున రాశి: ఈ రాశి వారు అనాయాసంగా ఉన్నత విద్యలకు అర్హతలు సంపాదించే అవకాశం ఉంది. వైద్యం, న్యాయం, ఇంజనీరింగ్ వంటి వృత్తి నైపుణ్యాలలో ఈ రాశి వారు ఆశించిన దాని కంటే ఎక్కువగా రాణించే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రస్తుతం గురు, బుధ, శుక్ర గ్రహాలు బాగా అను కూలంగా ఉన్నందువల్ల సొంత ఊర్లోనే ఉన్నత విద్యను తక్కువ ఖర్చుతో అభ్యసించడానికి అవకాశం ఉంది. ఉన్నత విద్యకు అర్హత ఇచ్చే పరీక్షలలో ఈ రాశి వారు తప్పకుండా ఘన విజయం సాధించే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి ఈ రాశి వారు ఎటువంటి ప్రయత్నం చేసినా అది సత్ఫలితాలను ఇస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి కొద్ది శ్రమతో ఉన్నత విద్యకు అవకాశం ఉంది. సాధారణంగా శిక్షణతో కూడుకున్న ఉన్నత విద్యలో చేరే అవకాశం ఉంటుంది. వీరికి వైద్యం, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, పరిశోధనలు వంటి రంగాలలో ప్రవేశించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉన్నత విద్య మీద భారీగా ఖర్చు చేయవలసి వస్తుంది. తప్పనిసరిగా దూర ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. ఉన్నత విద్య కోసం రాసే పరీక్షలు లేదా పోటీ పరీక్షలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. విద్యా స్థానంలో వక్ర గ్రహమైన కేతువు సంచరిస్తున్నందువల్ల అనుకోని ఆటంకాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.

సింహ రాశి: ఈ రాశి వారికి ఉన్నత విద్య స్థానమైన భాగ్య స్థానంలో నాలుగు గ్రహాలు కలిసి ఉండటం వల్ల టెక్నాలజీ, ఐఐటి, ఐఐఎం వంటి కోర్సులకు వెళ్లడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో సునాయాసంగా విజయాలు సాధించడం జరుగుతుంది. ఉన్నత విద్య కోసం దూరప్రాంతాలకు గానీ విదేశాలకు గానీ వెళ్లడం జరుగుతుంది. ఉన్నత విద్యకు సంబంధించి ఏ కోర్సుకు ప్రయత్నం చేసినా అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షల్లో కూడా నెగ్గటానికి అవకాశం ఉంది. పెద్దగా ఖర్చు లేకుండా మంచి కోర్సులో చేరే సూచనలు ఉన్నాయి.

కన్యా రాశి: ఈ రాశి వారు ఉన్నత విద్యకు వెళ్లడానికి అవకాశం ఉన్నప్పటికీ కొన్ని అవరోధాలు, ఆటంకాలు తప్పకపోవచ్చు. కొద్దిగా ఆలస్యంగా ఏదో ఒక కోర్సులో చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా స్థానాన్ని గురువు, శుక్ర గ్రహాలు వీక్షిస్తున్నందువల్ల తప్పకుండా వీరు విద్యారంగంలో పురోగతి సాధించడం సాధ్యమవుతుంది. సైన్స్, గణితం, భాషలు, సేవారంగం వంటి అంశాలలో వీరు మంచి కోర్సులను ఎంపిక చేసుకునే సూచనలున్నాయి. అయితే, గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఉన్నత విద్య కు సంబంధించిన విషయంలో కొద్దిగా రాజీ పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.

తులా రాశి: ఈ రాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం పూర్తిగా ఉన్నందువల్ల ఉన్నత విద్యకు సంబంధించి వీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అది తప్పకుండా సఫలం అవుతుంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన కోర్సులు వీరికి బాగా అనుకూలి స్తాయి. టెక్నాలజీ కోర్సులలో చేరే అవకాశం కూడా ఉంది. ఉన్నత విద్యకు సంబంధించిన పరీక్షలలో లేదా పోటీ పరీక్షలలో వీరు తప్ప కుండా విజయం సాధించడం జరుగుతుంది. సాధారణంగా బాగా దూర ప్రాంతంలో లేదా విదేశాలలో కోర్సులు చేసే సూచనలు ఉన్నాయి. ఉన్నత విద్యకు సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి విద్యా స్థానమైన నాలుగవ రాశిలో శనీశ్వరుడి సంచారం వల్ల కొద్దిపాటి శ్రమతో ఉన్నత విద్యలో ప్రవేశించే అవకాశం ఉంది. ఆర్ట్స్, హ్యుమానిటీస్, లలిత కళలు, వ్యాపార నైపుణ్యాలు వంటి అంశాలలో ఈ రాశి వారు ప్రావీణ్యం సంపాదించే సూచనలు ఉన్నాయి. కాస్తంత ఎక్కువగా ప్రయత్నం చేయగలిగితే డాక్టర్ కోర్సులో చేరటానికి అవకాశం ఉంది. సొంత ఊర్లోనే వీరికి ఉన్నత విద్య అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. పోటీ పరీక్షలకు వెళ్లడానికి సమయం ఏమంత అనుకూలంగా లేదు. ప్రతి చిన్న పనికి గట్టి ప్రయత్నం చేయవలసి వస్తుంది.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉండటం వల్ల ఉన్నత విద్యకు వెళ్లడం అనేది సమస్య కాకపోవచ్చు. ఏ కోర్సులో కావాలనుకుంటే ఆ కోర్సులో చేరటానికి గ్రహాలు సహకరిస్తాయి. వృత్తి నైపుణ్యాలు, టెక్నాలజీ, సైన్స్, అకౌంటెన్సీ వంటి రంగాలలో వీరు బాగా రాణించే అవకాశం ఉన్నందువల్ల అటువంటి కోర్సులలో చేరటం మంచిది. సాధారణంగా మెడిసిన్ లో చేరటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది తప్పకుండా సఫలం అవుతుంది. సొంత ఊర్లోనే మంచి కోర్సులో చేరటానికి అవకాశం ఉంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది.

మకర రాశి: ఈ రాశి వారికి విద్యా స్థానంలో నాలుగు గ్రహాల సంచారం వల్ల ఉన్నత విద్య ఈ రాశి వారికి బాగా అనుకూలిస్తుంది. మెడిసిన్ లో కానీ, టెక్నాలజీ సంబంధిత కోర్సులలో కానీ చేరే అవకాశం ఉంది. అతి తక్కువ ఖర్చుతో మంచి కోర్సులో చేరే సూచనలు ఉన్నాయి. ఉన్నత విద్యకు సంబంధించిన అంతవరకు వీరు ఎంత పాజిటివ్ గా వ్యవహరిస్తే అంతగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉన్నత స్థాయి కోర్సులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

కుంభ రాశి: ఈ రాశి వారు ఉన్నత విద్యలో చేరటానికి, మంచి కోర్సులో స్థానం సంపాదించడానికి అవకాశాలు బాగానే ఉన్నాయి. అయితే ఇందుకు సంబం ధించిన ప్రయత్నాలలో శ్రమ తిప్పటం అధికంగా ఉంటాయి. కొందరు స్నేహితులు, సన్నిహితుల సహాయంతో మంచి కోర్సులో చేరడం జరుగుతుంది. సాధారణంగా లా, బ్యాంకింగ్, అకౌంటెన్సీ, ఎకనామిక్స్, కామర్స్ వంటి కోర్సులలో ఈ రాశి వారు విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇష్టపడిన కోర్సులో అతి తక్కువ ఖర్చుతో సొంత ఊర్లోనే చేరటానికి అవకాశం కనిపిస్తోంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధించవచ్చు.

మీన రాశి: ఈ రాశి వారికి ఉన్నత విద్యలో చేరటం అనేది అతి సాధారణంగా, అతి సులువుగా జరిగే విషయం. ఇందుకు శుభగ్రహాలు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉండటమే కారణం. తమకు ఇష్ట మైన కోర్సులో సునాయాసంగా చేరిపోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా డబ్బు ఖర్చు ఉండకపోవచ్చు. ఎక్కువగా ప్రయత్నం కూడా అవసరం కాకపోవచ్చు. సాధారణంగా ఈ రాశి వారు మెడిసిన్ లో చేరటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యకు సంబంధించి ఏ పరీక్షలో అయినా వీరు అతి తీరికగా విజయం సాధించే సూచనలు ఉన్నాయి. ఉన్నత విద్యకు సంబంధించిన అంతవరకు వీరి అదృష్టం పండుతుందనే చెప్పాలి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..