Astro Money Tips: ఆర్ధిక ఇబ్బందులా 7 రోజుల్లో ఈ ఏడు పరిహారాలు చేసి చూడండి.. 45 రోజుల్లో మీకే రిజల్ట్ తెలుస్తుంది..

వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవతకు అంకితం చేయబడింది. మొత్తం వారంలోని 7 రోజులు ఏడు గ్రహాలకు సంబంధించినవి.. వాటి ప్రకారం మన జీవిత గమనం ఉంటుందని విశ్వాసం. గ్రహాలకు సంబంధించి ప్రతిరోజూ వేర్వేరు పరిష్కారాలు ఉన్నాయి. కనుక సంపాదించిన డబ్బులు నిల్వ ఉండాలన్నా.. సంపాదనలో లోటు లేకుండా ఉండాలన్నా కొన్ని పరిహార మార్గాలు ఉన్నాయి. ఈ రోజు ఆ మార్గాలు ఏమిటో తెలుసుకుందాం.

Astro Money Tips: ఆర్ధిక ఇబ్బందులా 7 రోజుల్లో ఈ ఏడు పరిహారాలు చేసి చూడండి.. 45 రోజుల్లో మీకే రిజల్ట్ తెలుస్తుంది..
Astro Tips To Become Rich
Follow us
Surya Kala

|

Updated on: May 15, 2023 | 7:46 AM

ప్రతి ఒక్కరూ తాను ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం లేకుండా తన కుటుంబానికి జీవితంలోని సుఖ సంతోషాలను ఆనందాన్ని అందించాలని కోరుకుంటాడు. ఇలాంటి కోరిక నెరవేరాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. డబ్బు కోసం కొన్ని పరిహారాలు చేస్తే.. ఖచ్చితంగా మీరు కోరిక నెరవేరుతుంది. అయితే నివారణలు సరైన మార్గంలో చేయాల్సి ఉంటుంది. కనుక ఈ రోజు డబ్బుకు లోటు లేకుండా చేసే పరిహారాలను గురించి తెలుసుకుందాం.

వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవతకు అంకితం చేయబడింది. మొత్తం వారంలోని 7 రోజులు ఏడు గ్రహాలకు సంబంధించినవి.. వాటి ప్రకారం మన జీవిత గమనం ఉంటుందని విశ్వాసం. గ్రహాలకు సంబంధించి ప్రతిరోజూ వేర్వేరు పరిష్కారాలు ఉన్నాయి. కనుక సంపాదించిన డబ్బులు నిల్వ ఉండాలన్నా.. సంపాదనలో లోటు లేకుండా ఉండాలన్నా కొన్ని పరిహార మార్గాలు ఉన్నాయి. ఈ రోజు ఆ మార్గాలు ఏమిటో తెలుసుకుందాం.

సోమవారం చేయాల్సిన పరిహారం: సోమవారం శివయ్యకు చెందిన రోజు. ఈ రోజు కోరికలు నెరవేర్చుకోవడానికి శివుడికి చేసే పూజ అత్యంత ఫలవంతం అని చెబుతారు. ఈ రోజున.. శ్రధభక్తులతో శివాలయంలోని శివలింగానికి అభిషేకం చేయండి. అదే విధంగా బిల్వ పత్రం, ఉమ్మెత్త, మారేడుని సమర్పించండి. మీ కోరికలను దేవుడిని చెప్పుకోండి.

ఇవి కూడా చదవండి

మంగళవారం చేయాల్సిన పరిహారం: మంగళవారం రోజు హనుమంతుడికి చెందిన రోజు. ఈ రోజున హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి, ఎరుపు రంగు దుస్తులు ధరించండి. అదే సమయంలో మోతీ చూర్ లడ్డూలను దేవునికి సమర్పించండి. పూజానంతరం మర్రి ఊడలతో దూపం వేసి ఇల్లంతా చూపించాలి.

బుధవారం చేయాల్సిన పరిహారం: బుధవారం గణపతి దేవుడికి చెందిన రోజు. ఈ రోజు ఆనందం, శ్రేయస్సు చిహ్నం. ఈ రోజున ఆకుపచ్చని బట్టలు లేదా  పచ్చని వస్తువులను దానం చేయండి. గణేశుడికి గరిక అంటే చాలా ఇష్టం కనుక బుధవారం గణేశుడికి 21 దూర్వాలు సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి.

గురువారం చేయాల్సిన పరిహారం: ఈ రోజు శ్రీ హరికి చెందినది. దోషాలు తొలగిపోవడానికి గురువారం పూజ  పరిష్కారమని చెబుతారు. ఈ రోజున పసుపు బట్టలు ధరించండి, పసుపు వస్తువులను దానం చేయండి, ఈ రోజు పూజ చేసిన తర్వాత, మర్రిఊడలను కాల్చి, ఇంటిలో దూపం వేయండి. ఈ రోజున స్నానం చేసే నీటిలో పసుపు పొడిని కలిపి స్నానం చేయాలి.

శుక్రవారం చేయాల్సిన పరిహారం: శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు. ఈ రోజులో అనేక పరిహారాలు ఉన్నాయి. ఈ రోజు గుడికి వెళ్లి అమ్మవారికి తామరపువ్వులు సమర్పించండి. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఈ రోజున పసుపు కుంకుమ సహా మహిళల అలంకరణ వస్తువులను దానం చేయండి. ఈ రోజున చేసే పూజలతో లక్ష్మీదేవి అనుగ్రహం సదా నిలిచి ఉంటుంది.

శనివారం చేయాల్సిన పరిహారం: శనివారం శనిశ్వరుడికి చెందిన రోజు. ఈ రోజు రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి. దానం చేయండి. దీని వల్ల ఏలినాటి శని దోషాలు తగ్గుతాయి. ఈ రోజున నీలి రంగు వస్తువులను దానం చేయండి.

ఆదివారం చేయాల్సిన పరిహారం: ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి చెందిన రోజు. ప్రతిరోజూ ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యభగవానుడిని  ప్రసన్నం చేసుకోవడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించండి. ఈ రోజున కోరికలను నెరవేర్చడానికి చేసే  ఉపవాస దీక్ష అత్యంత ఫలవంతం.

అయితే ఈ విధంగా వారంలో ఏడు రోజులూ చేసే ఈ పరిహారం 45 రోజుల పాటు ఎటువంటి నాగా లేకుండా నిరంతరం చేయాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర