Happiness Astro Tips: కుటుంబంలో వివాదాలపై.. చెడు దృష్టి మీపై ఉన్నట్లే.. ఈ చర్యలు చేస్తే మళ్ళీ ఆనందం మీసొంతం

చెడు దృష్టి  కారణంగా కుటుంబ సభ్యులకు సమస్యలు కలిగిస్తాయని నమ్ముతారు. ఒకొక్కసారి కుటుంబం సభ్యుల  ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. చెడు దృష్టి కారణంగా వ్యక్తి లోపల సానుకూల శక్తి నాశనం అవుతుంది. ప్రతికూల శక్తి ఉత్పత్తి అవుతుంది.

Happiness Astro Tips: కుటుంబంలో వివాదాలపై.. చెడు దృష్టి మీపై ఉన్నట్లే.. ఈ చర్యలు చేస్తే మళ్ళీ ఆనందం మీసొంతం
Astro Tips For Happiness
Follow us
Surya Kala

|

Updated on: May 14, 2023 | 9:15 AM

ఎవరైనా సరే జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలని కోరుకుంటారు. అయితే తమ జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు ప్రారంభమైతే నిరాశకు గురవుతారు. తమ ఫ్యామిలీపై చెడు దృష్టి పడిందని నమ్ముతారు. నవ్వుతు తుళ్లుతూ ఉండే ఫ్యామిలీలో ఒక్కసారిగా గ్రహణం పట్టినట్లు వివాదాలు చోటు చేసుకుంటాయి. దీనికి కారణం చెడు దృష్టి  కారణంగా కుటుంబ సభ్యులకు సమస్యలు కలిగిస్తాయని నమ్ముతారు. ఒకొక్కసారి కుటుంబం సభ్యుల  ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. చెడు దృష్టి కారణంగా వ్యక్తి లోపల సానుకూల శక్తి నాశనం అవుతుంది. ప్రతికూల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ పరిహారాలను చేయడం వలన జీవితం ప్రభావంతంగా సాగుతుంది.

మంగళ దీపం పరిహారం ప్రభావంతం..

కుటుంబానికి సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి వాస్తు శాస్త్రంలో మంగళ దీపం పద్ధతి వివరించబడింది. దీని కోసం ఒక గాజు కప్పు తీసుకోండి. అందులో గ్లాస్ టంబ్లర్‌ను తలకిందులుగా ఉంచండి. కప్పులో నాల్గవ వంతు నీటితో నింపండి. గాజు కప్పు చుట్టూ ఇనుప చట్రాన్ని ఏర్పాటు చేయండి.. ఇప్పుడు గాజు గ్లాసు పైన మట్టి దీపం ఉంచండి. నువ్వులు లేదా ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి. సాయంత్రం వేళలో ఈ మంగళ దీపాన్ని వెలిగించండి. పడుకునే ముందు దీపం ఆపివేయండి. ఇలా రోజూ మంగళదీపం సాయంత్రం వెలిగించండం శుభప్రదం.

ఇవి కూడా చదవండి

గుడికి వెళ్లి చేయాల్సిన పరిహారాలు  శనివారం రోజున హనుమంతుడి గుడి వెళ్లి సింధూరం తీసుకుని నుదిటిపై పెట్టుకోండి. ఇలా చేయడం వలన నర దిష్టి తొలగిపోతుంది. హనుమాన్ చాలీసా , సుందరకాండాన్ని క్రమం తప్పకుండా పఠించడం వల్ల కూడా చెడు దృష్టి నివారించవచ్చు.

ఏ వస్తువులను ధరించాలంటే..  చెడు దృష్టి పడకుండా ఉండాలంటే హనుమంతుడి లాకెట్ ధరించండి. అలాగే బ్లాక్ థ్రెడ్ చెడు దృష్టికి  దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. కుటుంబం మొత్తం తమ చేతులకు నల్ల దారం ధరించాలి. ఈ చర్యలన్నీ చేయడం ద్వారా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆర్ధిక లాభాలు ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).