Arasavalli Sun Temple: ఉత్తర ఆంధ్రుల ఆరాధ్య దైవం.. దేశ౦లో ఉన్న అతికొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటైన అరసవెల్లి దేవాలయం చరిత్ర..
ప్రాచీనమైన ఆలయాల్లో అరసవెల్లి సూర్యభగవానుడి ఆలయ౦ ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శ్రీకాకుళం కేంద్రానికి 1.6 కి.మీ దూరంలో ఉంది. ప్రతిఏటా రథ సప్తమికి వేలాదిగా భక్తులు ఇక్కడ సూర్యభగవానుడి దర్శనకి తరలివస్తారు. ఇప్పుడు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
Updated on: May 14, 2023 | 12:34 PM

ప్రాచీనమైన ఆలయాల్లో అరసవెల్లి సూర్యభగవానుడి ఆలయ౦ ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శ్రీకాకుళం కేంద్రానికి 1.6 కి.మీ దూరంలో ఉంది.

ప్రతిఏటా రథ సప్తమికి వేలాదిగా భక్తులు ఇక్కడ సూర్యభగవానుడి దర్శనకి తరలివస్తారు. ఇప్పుడు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇక్కడి ఏడాదికి రె౦డు సార్లు సూర్యకిరణాలు మూలవిరాట్ ను తాకుతాయి.ఇది ఈ ఆలయ నిర్మాణ గొప్పతన౦. శాసనాలు ప్రకారం 7వ శతాబ్ద౦లో ఈ ఆలయన్ని నిర్మించారు.

మన దేశ౦లో ఉన్న అతికొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. ఇక్కడి మూలవిరాట్ ను స్వయ౦గా దేవే౦ద్రుడు ప్రతిష్టించారని చెబుతారు. అయితే ‘పద్మపురాణ౦’ ప్రకార౦ ఇక్కడి మూలవిరాట్ ను సూర్య స్వగోత్రికుడు అయిన కశ్యప మహాముని ప్రతిష్టించారని చెప్పబడి౦ది.

17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలనలో ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ ఈ ప్రాంతంలో అనేకం దేవాలయాలను ధ్వంసం చేశాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి ఒకటి.

అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని ముందే తెలుసుకున్న హిందువుల న్యాయశాస్త్రం గురి౦చి, మను స౦స్కృతి గురించి సుబేదారుకు తెలియజేసే పండితుడు సీతారామ శాస్త్రి స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట.

157 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించి ఇప్పుడున్న రీతిలో దేవాలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతింది.





























