Andhra Pradesh: గంగపుత్రులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఈ రోజు ఉదయమే మీ ఖాతాల్లోకి రూ.10 వేలు.. పూర్తి వివరాలివే..
YSR Matsyakara Bharosa: ఆంధ్రప్రదేశ్‌లోని గంగపుత్రులకు శుభవార్త.. సముద్ర చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆసరాగా ప్రవేశపెట్టిన ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ నగదు ఈ రోజు ఉదయమే మీ ఖాతాలలో జమకానుంది. ఈ మేరకు బాపట్ల జిల్లా..
YSR Matsyakara Bharosa: గంగపుత్రులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సముద్ర చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆసరాగా ప్రవేశపెట్టిన ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ నగదు ఈ రోజు ఉదయమే మీ ఖాతాలలో జమకానుంది. ఈ మేరకు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మంగళవారం నిర్వహించనున్న సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా భరోసా పథకానికి ఆర్హులైన వారి ఖాతాల్లో రూ. 10 వేల నగదు జమ చేస్తారు. గత 4 నాలుగు సంవత్సరాలుగా అమలవుతున్న ఈ మత్య్సకార భరోసా పథకానికి ఇది ఐదో విడత. ఇక ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 1,23,519 మంది గంగపుత్రులు లబ్ధి పొందుతున్నారు.
కాగా, నడిసంద్రంలో బతుకు పోరాటం చేసే గంగపుత్రులకు వేట నిషేధ సమయంలో అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచే ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్య కాలాన్ని సముద్ర చేపల వేటకు నిషేధ సమయంగా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏటనే ప్రకటించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..