Watch Video: ‘స్పేస్ లేదు, క్రియేట్ చేసుకున్నాడు’..! వైరల్ అవుతున్న బౌలర్ వీడియో.. చూస్తే నవ్వాగదుగా..
మనలో చాలా మందికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది. క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లు స్పీడ్ కోసం నాన్‌స్ట్రైక్ వికెట్ల వెనుక కొంత దూరం నుంచి పరుగు తీస్తూ వచ్చి మెరుపు వేగంగా బంతిని విసురుతుంటారు. అచ్చు అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో..
మనలో చాలా మందికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది. క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లు స్పీడ్ కోసం నాన్‌స్ట్రైక్ వికెట్ల వెనుక కొంత దూరం నుంచి పరుగు తీస్తూ వచ్చి మెరుపు వేగంగా బంతిని విసురుతుంటారు. అచ్చు అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ఆ వీడియోలోని బౌలర్ బౌలింగ్ కోసం తీసిన పరుగు నెటిజన్లకు చాలా నవ్వు తెప్పించేదిగా ఉండడమే అందుకు కారణం. అవును, వీడియోలోని బౌలర్ బౌలింగ్ వేయడానికి వికెట్ల వెనుక ఖాళీ లేకపోవడంతో అతను సందులో నుంచి పరుగు తీసుకుంటూ వచ్చి బంతిని విసిరాడు. చూడడానికి స్కూల్ గ్రౌండ్‌లా ఉన్నప్పటికీ వారు ఆడడానికి అక్కడ సరపడా స్థలం లేదు. దీంతో అతను అలా సందులో నుంచి రన్నింగ్ చేస్తూ వచ్చాడు.
ఇక కింద ఉన్న వీడియోలో మీరు అందుకు సంబంధించిన దృశ్యాలను చూడవచ్చు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ చెప్పినట్లుగానే ఇక్కడ కూడా బౌలర్‌కి స్పేస్ లేదు.. ఆయన క్రియేట్ చేసుకున్నాడు’ డైలాగ్‌ని గుడ్డిగా ఫాల్లో అయ్యాడు ఈ బౌలర్ అని కొందరు, ఆడేందుకు గ్రౌండ్ ఉన్నా లేకున్నా క్రికెట్ ఆడడమే ముఖ్యమని మరికొందరు రాసుకొస్తున్నారు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు తమ తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..