AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lorry Owners Association: పెంచిన పన్నులపై ఏపీ లారీ ఓనర్ల ఆందోళన.. ‘వెంటనే తగ్గించకుంటే ఉద్యమిస్తాం’ అంటూ..

పెంచిన గ్రీన్‌ టాక్స్‌పై విజయవాడ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నిరసన గళం విప్పింది. టాక్స్‌ల పెంపుదలపై జీవో నంబర్‌ 1 ద్వారా ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ ఇచ్చిన ప్రభుత్వ చర్యలపై మండిపడుతున్నారు.

Lorry Owners Association: పెంచిన పన్నులపై ఏపీ లారీ ఓనర్ల ఆందోళన.. ‘వెంటనే తగ్గించకుంటే ఉద్యమిస్తాం’ అంటూ..
AP Lorry Owners Association
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 17, 2023 | 5:50 AM

Share

రవాణా రంగంలో గ్రీన్‌ ట్యాక్స్‌ వొడ్డింపులు లారీ ఓనర్ల నడ్డివిరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌. ఓ వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతోంటే, మరో వైపు ఏపీ ప్రభుత్వం భారీగా టాక్స్‌లు పెంచుతూ పోతోందన్నారు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు వై.వి. ఈశ్వర్‌రావు. తాజాగా జీవో నంబర్1 విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం లారీ ఓనర్స్‌పై 200 నుండి 20 వేల వరకు టాక్స్‌ల భారం మోపిందన్నారు. ఓవర్ హైట్ కి 1000 నుండి 20 వేల రూపాయల భారం పెంచిందని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మరోవైపు ఇదే విషయంపై సీఎం జగన్‌‌కి, రవాణా శాఖ మంత్రికి వినతి ‌పత్రాలు సమర్పించామన్నారు లారీ ఓనర్స్‌. జోఓ 31 తో 25 శాతం పన్నులు పెంచారన్నారు. డీజిల్ రేట్లు దృష్టిలో ఉంచుకుని త్రైమాసిక పన్నులు పెంచవద్దని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 శాతం పెంచిన త్రైమాసిక పన్నులను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో త్వరలోనే ఉద్యమబాట పడతామని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..  ఇక్కడ క్లిక్ చేయండి..