క‌ర్ణాట‌కలోని ఎమ్మెల్యేలంతా కోటీశ్వరులే..! లెక్కలు చూస్తే చుక్కలు లెక్కేటినట్లే..

Karnataka Rich MLAs: క‌ర్ణాట‌క రాజ‌కీయ నేత‌లు చాలా రిచ్ అని నిరూపించారు. ఎందుకంటారా..? క‌ర్ణాట‌కలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ కోటీశ్వరులే. ఆ నియోజ‌క‌వ‌ర్గం, ఈ నియోజ‌క‌వ‌ర్గం అనే తేడా లేదు.. ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేదు.. అన్ని పార్టీల నుంచి, దాదాపు అన్ని..

క‌ర్ణాట‌కలోని ఎమ్మెల్యేలంతా కోటీశ్వరులే..! లెక్కలు చూస్తే చుక్కలు లెక్కేటినట్లే..
Karnataka Rich MLAs
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Narender Vaitla

Updated on: May 16, 2023 | 7:00 AM

Karnataka Rich MLAs: క‌ర్ణాట‌క రాజ‌కీయ నేత‌లు చాలా రిచ్ అని నిరూపించారు. ఎందుకంటారా..? క‌ర్ణాట‌కలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ కోటీశ్వరులే. ఆ నియోజ‌క‌వ‌ర్గం, ఈ నియోజ‌క‌వ‌ర్గం అనే తేడా లేదు.. ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేదు.. అన్ని పార్టీల నుంచి, దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. కొత్తగా ఎన్నికైన కర్ణాటక ఎమ్మెల్యేలు వందల కోట్లకుపైగా సంపదను కలిగి ఉన్నారు. ఇందులో 50 శాతం సంపద 12 మంది ఎమ్మెల్యేల దగ్గరే ఉంది. కర్ణాటకలో మొత్తం 224 ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 210 మంది కోటీశ్వరులే. ఏది ఏమైతేనేం.. బీజేపీ, జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా రికార్డులకెక్కారు.

మరోవైపు కొత్తగా ఎన్నికైన చట్టసభ ప్రతినిధుల్లో అత్యధిక మంది కోటీశ్వరులైన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. కోటీశ్వరులైన ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఊహించిన దాని కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకున్న జేడీఎస్‌ కూడ ఆస్తుల విలువల్లో ఏ మాత్రం తీసిపోలేదు. జెడిఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కూడా గట్టిగానే కూడబెట్టారు.

కర్ణాటకలో టాప్ 7 సంపన్న ఎమ్మేల్యేలు..

  1. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మొత్తం ఆస్తుల విలువ రూ.1,149 కోట్లు.. కర్ణాటకలోని అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే
  2. స్వతంత్య్ర ఎమ్మెల్యే సురేశ్‌ బీఎస్‌‌కి 533 కోట్ల రూపాయల ఆస్తి
  3. కాంగ్రెస్ నేత ప్రియాకృష్ణ ఆస్తుల విలువ రూ.275 కోట్లు
  4. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్‌ఏ హరీష్‌ వద్ద రూ.411కోట్ల ఆస్తులు
  5. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్‌ ఎన్‌ సుబ్బారెడ్డి ఆస్తుల విలువ రూ. 244 కోట్లు
  6. బీజేపీ ఎమ్మెల్యే హెచ్‌కే సురేష్‌ రూ.423 కోట్ల ఆస్తి
  7. జేడీఎస్‌ ఎమ్మెల్యే ఎంఆర్‌ మంజూనాథ్‌ రూ.255 కోట్ల ఆస్తి

కాగా, ఇటీవల కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.1,149 కోట్లు అని తెలిపారు. అఫిడవిట్ సమర్పించిన కాంగ్రెస్ నేతల్లో డీకే దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. కాంగ్రెస్‌కు చెందిన మరో నేత సురేశ్‌ బీఎస్‌ 533 కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్నారు. బీబీఎంపీ సౌత్ జిల్లాలోని గోవిందరాజ్ నగర్ నుంచి ఎన్నికైన ప్రియాకృష్ణ ఆస్తుల విలువ రూ.275 కోట్లు. శాంతినగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎన్‌ ఏ హరీష్‌ వద్ద 411కోట్ల ఆస్తులున్నాయి. ఎస్‌ ఎన్‌ సుబేరారెడ్డి ఆస్తుల విలువ 244 కోట్లు. ఇక బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన హెచ్‌కే సురేష్‌ 423 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు. జేడీఎస్‌ చెందిన ఎంఆర్‌ మంజూనాథ్‌ 255 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి