Multiplex: భారీగా మూతపడుతోన్న మల్టీప్లెక్సులు.. 50 స్క్రీన్లను మూసేస్తున్న ప్రముఖ సినిమా సంస్థ.

మల్టీప్లెక్సులకు పెట్టింది పేరైన పీవీఆర్‌ సినిమా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన పీవీఆర్‌ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించింది. మల్టీప్లెక్స్‌ స్క్రీన్ల నిర్వహణలో టాప్‌గా ఉన్న PVR సినిమా సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది...

Multiplex: భారీగా మూతపడుతోన్న మల్టీప్లెక్సులు.. 50 స్క్రీన్లను మూసేస్తున్న ప్రముఖ సినిమా సంస్థ.
Multiplex
Follow us
Narender Vaitla

|

Updated on: May 16, 2023 | 6:51 AM

మల్టీప్లెక్సులకు పెట్టింది పేరైన పీవీఆర్‌ సినిమా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన పీవీఆర్‌ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించింది. మల్టీప్లెక్స్‌ స్క్రీన్ల నిర్వహణలో టాప్‌గా ఉన్న PVR సినిమా సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. జనవరి-మార్చి నాలుగో త్రైమాసికంలో పీవీఆర్‌- ఐనాక్స్‌కు దాదాపు రూ. 333 కోట్ల నష్టం వచ్చింది. గతేడాది ఇదే సమయంలోనూ వందకోట్లకుపైగా నష్టాలపాలైంది. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, అందుకు తగ్గట్టుగా ఆదాయం లేకపోవడం, బాలివుడ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడటంతో సంస్థ నష్టాలను చవిచూసింది.

వీటికి తోడు ఓటీటీల ప్రభావం ఉండనే ఉంది. ఇక నష్టాల్లో ఉన్న పలు చోట్ల స్క్రీన్లను మూసివేయాలని ఈ సంస్థ నిర్ణయించింది. ఈ విధంగా రానున్న ఆరు నెలల్లో 50 PVR స్క్రీన్స్‌ మూతపడబోతున్నాయి. అయితే, స్క్రీన్‌లు మూసివేసినా.. మల్టీప్లెక్స్‌లలోని మాల్స్ కొనసాగుతాయని పీవీఆర్‌-ఐనాక్స్‌ తెలిపింది. ఏడాది క్రితం PVR, ఐనాక్స్‌ లీజర్‌ సంస్థలు విలీనం అవ్వడం ద్వారా దేశంలోనే అతిపెద్ద మల్టిప్లెక్స్‌ సంస్థ ఆవతరించిన విషయం తెలిసిందే. పీవీఆర్‌-ఐనాక్స్‌ థియేటర్స్‌ పేరుతో భారత్‌, శ్రీలంకలో మొత్తం 1689 మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లు నడుపుతోంది ఈ సంస్థ. గత ఆర్థిక సంవత్సరంలో పీవీఆర్‌-ఐనాక్స్‌ కొత్తగా 168 స్క్రీన్‌లను ఓపెన్‌ చేశాయి కూడా.

ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మరో 150-175 స్క్రీన్‌లను ఓపెన్‌ చేయాలని భావించింది. వీటిలో 9 ఇప్పటికే ఓపెన్‌ చేయగా, 15 స్క్రీన్‌లు అనుమతి కోసం ఉన్నాయి. మరో 152 స్క్రీన్‌లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అయితే గత ఏడాదిగా విడుదల చేసిన పలు హిందీ, ఇంగ్లష్‌ సినిమాలు.. బాక్సాఫీస్‌ దగ్గర అనుకున్నట్లుగా కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో పరిస్థితి తారుమారైంది. సంస్థ తీవ్ర నష్టాల్లోకి జారిపోయింది. ఇక థియేటర్లు మూసివేయడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయానికొచ్చింది PVR సంస్థ. మందుగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించింది. ఇది మల్టీప్లెక్స్‌ సినీ ప్రియులకు నిజంగా చేదువార్తే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..