Liquor Deaths: ‘కల్తీ సారా’ మోగించిన మరణ మృదంగం..! 14 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం..

Adulterated Liquor Deaths: తమిళనాడు విల్లుపురం జిల్లాలో మత్స్యకార గ్రామాల్లో విషాదం అలముకుంది. కల్తీ సారాతాగి 14 మంది మృత్యువాత పడ్డారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా ‘మరకానం’ మత్స్యకార గ్రామాలలో మరణ మృదంగం..

Liquor Deaths: ‘కల్తీ సారా’ మోగించిన మరణ మృదంగం..! 14 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం..
Adulterated Liquor Deaths
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 16, 2023 | 6:30 AM

Adulterated Liquor Deaths: తమిళనాడు విల్లుపురం జిల్లాలో మత్స్యకార గ్రామాల్లో విషాదం అలముకుంది. కల్తీ సారాతాగి 14 మంది మృత్యువాత పడ్డారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా ‘మరకానం’ మత్స్యకార గ్రామాలలో మరణ మృదంగం మోగింది. కల్తీ సారా తాగి 14 మంది మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. విల్లుపురం జిల్లాకు చెందిన అమరన్ అనే వ్యక్తి వంబామేడు తీర ప్రాంతంలో సారాయి వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల కొందరు జాలర్లు వేటకు వెళ్లి తొరిగొచ్చాక.. అమరన్ వద్దకు వచ్చి సారాయి సేవించారు. కొంతసేపటికి ఇళ్లకు చేరుతూనే జాలర్లు స్పృహతప్పి పడిపోయారు. ఒకరి తర్వాత ఒకరుగా సారాయి సేవించిన జాలర్లంతా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని  విల్లుపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే కొందరు జాలర్లు ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది చికిత్స పొందుతూ దుర్మరణం చెందారు. ఇప్పటి వరకు 14 మంది జాలర్లు చనిపోగా, 25 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కల్తీ సారాయి సేవించడం వల్లే జాలర్లు మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సారాయి దుకాణంపై దాడి చేసి అమరన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇక విల్లుపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం స్టాలిన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారికి 50వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బాధితులకి అందుతున్న వైద్య సేవలు, కల్తీసారా ఘటనలపై సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలు, వినియోగాన్ని అరికట్టేందుకు గట్టిగా కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కల్తీ సారా కేంద్రాలపై అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల మందికిపైగా అరెస్ట్‌ చేశారు. మరోవైపు కల్తీసారా మరణాల ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!