Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Tourist Places: వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? దక్షిణాది భారతంలోని ఈ హిల్ స్టేషన్లను సందర్శించడం మర్చిపోకండి..

దక్షిణ భారతదేశంలోఅనేక పర్యాటక ప్రదేశాలు, హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఈ హిల్ స్టేషన్లు చాలా ప్రసిద్ధమైనవి, పైగా అందమైనవి. వారాంతంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించేందుకు చక్కగా ఉంటాయి. మరి ఈ క్రమంలో దక్షిణాది భారతంలో తప్పక సందర్శించాల్సిన హిల్ స్టేషన్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: May 16, 2023 | 6:15 AM

బెంగళూరును సిలికాన్ సిటీ అంటారని మనకు తెలిసిందే. అయితే బెంగళూరు దాని గొప్ప సంస్కృతి, ప్రకృతి సౌందర్యం, సంప్రదాయం, నైట్ లైఫ్‌స్టైల్‌కి కూడా చాలా ప్రసిద్ధి.  పైగా బెంగుళూరు చుట్టూ అనేక హిల్ స్టేషన్లు ఉన్నాయి. వాటిని మీరు సందర్శించవచ్చు.

1 / 5
నంది హిల్ స్టేషన్: నంది హిల్ స్టేషన్ వీకెండ్స్‌లో సందర్శించడానికి గొప్ప ప్రదేశం. ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. అంతే కాకుండా చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు సూర్యోదయ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇంకా శ్రీ భోగ్ నందీశ్వర గుడి, టిప్పు డ్రాప్ ఇక్కడ ప్రధాన పర్యాటక ఆకర్షణలు.

2 / 5
మడికేరి: ప్రకృతి ప్రేమికులకు ఇది గొప్ప ప్రదేశం. ఈ హిల్ స్టేషన్ కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి. పచ్చటి ప్రకృతి దృశ్యాలు, వాటి గుండా ప్రవహించే నీటి ప్రవాహాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడ మీరు ఇరుప్పు,  ఇతర అందమైన ప్రదేశాలతో సహా అనేక జలపాతాలను చూడవచ్చు.

3 / 5
ఊటీ: దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఊటీ ఒకటి. ఇది తమిళనాడులో ఉంది. ఊటీ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి తేయాకు తోటలు ప్రధాన పర్యాటక ఆకర్షణ. గవర్నమెంట్ రోజ్ గార్డెన్, అవలాంచె లేక్, సెయింట్ స్టీఫెన్స్ చర్చ్‌లను ఇక్కడ సందర్శించవచ్చు.

4 / 5
చిక్కమగళూరు: చిక్కమగళూరు అనేక అందమైన పర్యాటక ప్రదేశాలతో కూడిన జిల్లా. ఇది బెంగళూరుకు సమీపంలో ఉంది. వీకెంట్స్‌లో సందర్శించేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడి ప్రశాంత వాతావరణం మిమ్మల్ని రిలాక్స్‌గా ఫీలయ్యేలా చేస్తుంది. హెబ్బే వాటర్ ఫాల్స్, శ్రీ శారదాంబ అమ్మనవర దేవాలయం, ముల్లయనగిరి కొండను మీరు ఇక్కడ సందర్శించవచ్చు.

5 / 5
Follow us