Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lovers: బాయ్‌ ఫ్రెండ్‌ అలా చేశాడని ఆగ్రహించిన గర్ల్‌ఫ్రెండ్.. 3 రోజులుగా గదిలో ఉంచి..

లవర్స్ పంచాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న అంశానికి ఇద్దరి మధ్య గొడవలు, ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. చిన్నపాటి టామ్ అండ్ జెర్రీ మాదిరిగా ఉంటుంది పరిస్థితి. తాజాగా ఇలాంటి ఇంట్రస్టింగ్ గొడవ ఒకటి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను గదిలో బంధించింది.

Lovers: బాయ్‌ ఫ్రెండ్‌ అలా చేశాడని ఆగ్రహించిన గర్ల్‌ఫ్రెండ్.. 3 రోజులుగా గదిలో ఉంచి..
Lovers
Follow us
Shiva Prajapati

|

Updated on: May 22, 2023 | 10:13 AM

లవర్స్ పంచాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న అంశానికి ఇద్దరి మధ్య గొడవలు, ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. చిన్నపాటి టామ్ అండ్ జెర్రీ మాదిరిగా ఉంటుంది పరిస్థితి. తాజాగా ఇలాంటి ఇంట్రస్టింగ్ గొడవ ఒకటి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను గదిలో బంధించింది. దాదాపు మూడు రోజుల పాటు నీళ్లు, ఆహారం ఇవ్వకుండా గదిలోనే ఉంచింది. ఈ వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

అర్జెంటీనాకు చెందిన ఓ అమ్మాయి.. తన బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచింది. ఆ వెంటనే అతనితో వాగ్వాదానికి దిగింది. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే.. అతన్ని గదిలో వేసి బంధించింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు రోజుల పాటు.. తిండీ, నీళ్లు ఏవీ ఇవ్వకుండా ఆకలితో అలమటించేలా శిక్ష విధించింది. ఇంతకీ ఆ అమ్మాయి తన ప్రియుడికి అంతటికి శిక్ష ఎందుకు వేసిందనేగా మీ ఆలోచన.. అది కూడా తెలుసుకుందాం.

ఈ అమ్మాయి, అబ్బాయి.. గత కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే, ఇటీవల అతగాడు.. మరో అమ్మాయితో క్లోజ్‌ మాట్లాడటం ఈవిడ గారు చూశారు. ఇంకేముంది.. కోపం నశాలానికి అంటింది. అతన్ని తన ఇంటికి పిలిచింది. అతని ఫోన్ తీసుకుని చెక్ చేసింది. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇంతలో కోపంతో ఊగిపోయిన అమ్మాయి.. తన ప్రియుడిని గదిలో పెట్టి తాళం వేసింది. మూడు రోజుల పాటు అతనికి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. అయితే, ఎలాగోలా అతను అమ్మాయి ఫోన్‌ ద్వారా తన స్నేహితులకు జరిగిన విషయాన్ని మెసేజ్ చేశాడు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అమ్మాయి ఇంటికి వెళ్లారు. అక్కడ బంధీగా ఉన్న యువకుడిని విడిపించారు. అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ.. తరచుగా గొడవపడేవారు. ముఖ్యంగా అమ్మాయి తన ప్రియుడితో నిరంతరం వాగ్వాదానికి దిగేదట. ప్రతి విషయంలో అనుమానించేదట. ప్రస్తుతం అమ్మాయి పోలీసుల అదుపులో ఉంది. అమ్మాయిని, అబ్బాయిని ఇద్దరినీ విచారిస్తున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు