Samsung Galaxy A14: మరో గెలాక్సీ ఫోన్ రిలీజ్ చేసిన సామ్‌సంగ్ .. వారే అసలు టార్గెట్..
హైఎండ్ మార్కెట్‌లో సామ్‌సంగ్ తన మార్క్ చూపిస్తున్నప్పటికీ బడ్జెట్ ఫోన్స్‌లో మాత్ర కాస్త వెనుకబడి ఉంది. అయితే ఇతర కంపెనీలు కేవలం బడ్జెట్ ఫోన్లతోనే అధిక మార్కెట్ సొంతం చేసుకున్నాయి. దీంతో సామ్‌సంగ్ కూడా బడ్జెట్ ఫోన్స్ రిలీజ్ చేయడంపై దృష్టి పెట్టింది.

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ప్రారంభంలో తన హవా చూపించిన సామ్ సంగ్ తర్వాత ఇతర కంపెనీల రాకతో సేల్స్ పరంగా కొంత వెనుకంజలో ఉంది. అయితే ఇతర కంపెనీల నుంచి వస్తున్న విపరీతమైన పోటీను ఎదుర్కొనేందుకు సామ్‌సంగ్ కంపెనీ కూడా బడ్జెట్ ఫోన్లను రిలీజ్ చేస్తుంది. హైఎండ్ మార్కెట్‌లో సామ్‌సంగ్ తన మార్క్ చూపిస్తున్నప్పటికీ బడ్జెట్ ఫోన్స్‌లో మాత్ర కాస్త వెనుకబడి ఉంది. అయితే ఇతర కంపెనీలు కేవలం బడ్జెట్ ఫోన్లతోనే అధిక మార్కెట్ సొంతం చేసుకున్నాయి. దీంతో సామ్‌సంగ్ కూడా బడ్జెట్ ఫోన్స్ రిలీజ్ చేయడంపై దృష్టి పెట్టింది. తాజాగా సామ్‌సంగ్ ఏ 14 పేరుతో బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అన్ని ఫోన్లు 5జీ టెక్నాలజీతో వస్తున్నా ఈ ఫోన్ మాత్రం సామ్‌సంగ్ 4 జీ సపోర్ట్‌తోనే ఈ ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ధర ఇతర స్పెసిఫికేషన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఏ 14 ధర
4 జీబీ+64 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న బేసిక్ గెలాక్సీ ధర రూ.13,999కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే 128 జీబీ వేరయింట్ ధర మాత్రం కంపెనీ రూ.14,999గా నిర్ణయించింది. అలాగే ఈ ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే వినియోగదారులు ఈ ఫోన్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఏ 14 ఫోన్ సామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో కొనుగోలు అందుబాటులో ఉంది.
ఏ 14 స్పెసిఫికేషన్లు ఇవే
సామ్‌సంగ్ ఏ 14 ఫోన్ ఇతర ఫోన్ మాదిరిగానే సింపుల్ డిజైన్‌తో వస్తుంది. అయితే ధరకు తగినట్లే బిల్డ్ క్వాలిటీ ఉందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ స్టైల్‌తో వస్తుంది. అయితే ప్రస్తుతం అందరూ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేలు వాడుతున్నా ఈ ఫోన్ మాత్రం ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. దీంతో బెటర్ పిక్చర్ క్వాలిటీ వినిగోదారులు పొందుతారు. అలాగే ఈ ఫోన్ 6 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. అలాగే పూర్తి 1080×2408 రిజల్యూషన్‌ను అందిస్తుంది. 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే ఈ ఫోన్‌లో 5 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఆకర్షణయంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ హెచ్‌డీ వీడియోలను 30 ఎఫ్‌పీఎస్ వద్ద రికార్డ్ చేస్తుంది. అలాగే ఎస్‌డీ కార్డ్‌ను 1 టీబీ వరకూ విస్తరించుకునే అవకాశం ఉంది. అలాగే 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌తో సామ్‌సంగ్ చార్జర్‌ను అందించదు. ఆ చార్జర్‌ను మరో రూ.1299తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..