Washington DC: అమెరికా వైట్‌హౌస్‌పై తెలుగు కుర్రాడి దాడి.. ‘ప్రెసిడెంట్ బైడెన్‌ను చంపేందుకే’..
Washington DC: అమెరికా వాషింగ్టన్ డీసీలోని ఆ దేశ అధ్యక్ష భవనం వైట్ హౌస్ పరిసరాల్లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. వైట్‌హౌస్‌కు సమీపంలోని లాఫేట్ స్క్వేర్ వద్ద సోమవారం రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు సెక్యూరిటీ బారికేడ్లను ఢీ కొట్టింది. వెంటనే అప్రమత్తమైన..
Washington DC: అమెరికా వాషింగ్టన్ డీసీలోని ఆ దేశ అధ్యక్ష భవనం వైట్ హౌస్ పరిసరాల్లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. వైట్‌హౌస్‌కు సమీపంలోని లాఫేట్ స్క్వేర్ వద్ద సోమవారం రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు సెక్యూరిటీ బారికేడ్లను ఢీ కొట్టింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ డ్రైవర్‌ని భారత సంతతికి చెందిన తెలుగు కుర్రాడని, అతని పేరు సాయివర్షిత్ కందుల అని వారు గుర్తించారు. సదరు యువకుడిని ప్రశ్నించగా తాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్‌ని లక్ష్యంగా చేసుకున్నానని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ మేరకు సాయివర్షిత్ కందులపై మారణాయుధాల వినియోగం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు యత్నించడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర అభియోగాలతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇంకా ఈ విషయాన్ని మంగళవారం ఉదయం అధ్యక్షుడు బైడెన్ దృష్టికి తీసుకువెళ్లారు. అమెరికాలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్ 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. ఇంకా సామాజిక మాధ్యమాల్లోని అతని అకౌంట్స్ ద్వారా అతని వ్యక్తిగత వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా అమెరికాలోని స్థానికి మీడియా కథనాలు ప్రకారం సాయివర్షిత్ కందులకు జర్మన్‌లోని నాజీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న భావజాలం అతనికి ఉన్నట్లు, ఇంకా అతను నడిపిన ట్రక్ నుంచి నాజీ జెండాలను గుర్తించి తొలగించినట్లు పేర్కొంటున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..