- Telugu News Photo Gallery Cricket photos CSK vs GT: Why green tree symbol have replaced dot balls on IPL 2023 scorecards
CSK vs GT: పర్యావరణం కోసం బీసీసీఐ వినూత్న ప్రయత్నం.. స్కోర్‌కార్డ్‌లోని ‘గ్రీన్ ట్రీ’ సింబల్ కూడా అందుకే..! అసలు విషయం ఏమిటంటే..?
IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ధోని సేన 15 పరుగుల తేడాతో విజయం సాధించి, నేరుగా ఐపీఎల్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అయితే మ్యాచ్ సమయంలో స్కోర్‌బోర్డ్‌పై.. డాట్ బాల్స్‌కి బదులు కనిపించిన గ్రీన్ ట్రీపైనే ఇప్పుడు అందరి చర్చ.
Updated on: May 24, 2023 | 6:40 AM

IPL 2023 GT vs CSK: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన IPL మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా, స్కోర్‌బోర్డ్‌లోని ప్రత్యేక గ్రీన్ ట్రీ గ్రాఫిక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ సమయంలో, డాట్ బాల్ స్థానంలో ఆకుపచ్చ చెట్టు సింబల్ ఇవ్వబడింది. ఇలా గ్రాఫిక్స్ చేంజ్ చేసి గ్రీన్ టీ కనిపించడానికి ప్రధాన కారణం బీసీసీఐ తీసుకున్న కొత్త నిర్ణయమే.

అవును, ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల సమయంలో వేసిన ప్రతి డాట్ బాల్‌కు 500 చెట్లను నాటాలని బీసీసీఐ ప్రకటించింది. అందువల్ల డాట్ బాల్ స్థానంలో ఆకుపచ్చ చెట్టును ఉపయోగించారు.

ఇప్పుడు, BCCI చేపట్టిన కొత్త ప్రచారానికి చాలా ప్రశంసలు లభిస్తున్నాయి ఇంకా దీని వల్ల భారతదేశం పచ్చగా మారుతుందని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు, పర్యావరణ ప్రేమికులు సంతోషిస్తున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే జట్టు రుతురాజ్ గైక్వాడ్ (60) అర్ధ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

అనంతరం 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు 157 పరుగులకే ఆలౌట్ అయి 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో సీఎస్‌కే ఫైనల్‌లోకి ప్రవేశించింది.
