AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు దుర్మరణం

గత కొంతకాలంగా చిత్ర సీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నితీష్‌ పాండే (51) గుండె పోటుతో మంగళవారం మృతి చెందారు. ముంబైలోని ఇగత్‌పురిలో ఆయన మృతి చెందినట్లు నిర్మాత సిద్ధార్థ్ బుధవారం తెల్లవారుజామున..

సినీ పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు దుర్మరణం
Nitesh Pandey
Srilakshmi C
|

Updated on: May 24, 2023 | 11:39 AM

Share

గత కొంతకాలంగా హిందీ చిత్ర సీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నితీష్‌ పాండే (51) గుండె పోటుతో మంగళవారం మృతి చెందారు. ముంబైలోని ఇగత్‌పురిలో ఆయన మృతి చెందినట్లు నిర్మాత సిద్ధార్థ్ బుధవారం తెల్లవారుజామున ధృవీకరించారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు, బుల్లితెర ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

నితీష్‌ స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని అల్మోరా కుమావోన్‌. అశ్విని కల్సేకర్‌ను అయన వివాహం చేసుకున్నాడు. 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత జస్టజూ అనే టీవీ షోలో పరిచయమైన నటి అర్పితా పాండేని 2003లో వివాహం చేసుకున్నాడు. తన పాతికేళ్ల నటనా జీవితంలో ఎన్నో సీరియల్స్‌, టీవీ షోలు, మువీల్లో నితీష్‌ నటించాడు. ‘ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా’, ‘ఇండియావాలి మా’, ‘ఏక్ రిష్తా సాజెదారీ కా’ వంటి పలు టెలివిజన్‌ సిరీస్‌లు.. ఏక్ ప్రేమ్ కహాని, సాయా, జస్టజూ, దుర్గేష్ నందిని వంటి ఎన్నో హిందీ సీరియల్స్‌లో ఆయన నటించారు.

ఇవి కూడా చదవండి

స్మాల్ స్క్రీన్‌లోనే కాకుండా..’ఓం శాంతి ఓం’,’దబాంగ్ 2′, ‘ఖోస్లా కా ఘోస్లా’, ‘మదారి’, ‘బదాయి దో’, ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ వంటి బాలీవుడ్ మువీల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నితీష్ పాండే నటుడిగా మాత్రమేకాకుండా డ్రీమ్ కాజిల్ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను కూడా నడిపాడు. ‘ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా’ సిరీస్‌లో హరీష్ కుమార్ పాత్ర పోషించినందుకు పాపులారిటీ దక్కించుకున్నాఉ. నితీష్‌ చివరిసారిగా ప్రముఖ టీవీ షో అనుపమలో నటించారు. ఖోస్లా కా ఘోస్లాలో నితీష్ పాండే యాక్టింగ్ అందరి ప్రశంశలు అందుకునేలా చేసింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.