TS Lawcet 2023 Exam: నేడే తెలంగాణ లాసెట్-2023 ప్రవేశ పరీక్ష.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు లాసెట్ - 2023 ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. లాసెట్, పీజీసెట్ పరీక్షలు మొత్తం మూడు సెషన్లలో జరగనున్నాయి. మూడేళ్ల లా కోర్సు ప్రవేశ పరీక్ష.. ఉదయం 9.30 గంటల..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు లాసెట్ – 2023 ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. లాసెట్, పీజీసెట్ పరీక్షలు మొత్తం మూడు సెషన్లలో జరగనున్నాయి. మూడేళ్ల లా కోర్సు ప్రవేశ పరీక్ష.. ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. ఐదేండ్ల లా కోర్సు, పీజీలాసెట్ ప్రవేశ పరీక్ష.. సాయంత్రం 4గంటల నుంచి 5: 30 గంటల వరకు నిర్వహిస్తారు.
మొత్తం 43,692 మంది అభ్యర్ధులు టీఎస్ లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశ పరీక్షలకు హాజరుకానున్నారు. తెలంగాణలో 60, ఏపీలో 4 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసినట్టు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. పరీక్ష కేంద్రానికి హాల్ టికెట్‌తోపాటు ఓ ఫొటో ఐడెంటిటీ తప్పనిసరిగా తీసుకురావల్సి ఉంటుందని విద్యార్ధులకు సూచించారు. నిముషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.