Summer Special Trains: నేటి నుంచి కాచిగూడ, కాకినాడ, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు.. ట్రైన్స్ షెడ్యూల్ డీటైల్స్ మీ కోసం
హైదరాబాద్ లోని ప్రముఖ రైల్వే స్టేషన్ కాచిగూడ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ఈ స్పెషల్ ట్రైన్స్ ను నేటి నుంచి నడపనుంది. ఈ స్పెషల్ ట్రైన్స్.. కాచిగూడ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కాచిగూడ, కాచిగూడ నుంచి కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ నుంచి కాచిగూడ మధ్య ప్రయాణించనున్నాయి. ఈ స్పెషల్ ట్రైన్స్ లో ఏసీ - 2 టైర్, ఏసీ - 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉండనున్నాయని అధికారులు చెప్పారు.
వేసవి సెలవులు వస్తే చాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్స్ రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించిన రైల్వే అధికారులు.. మరోసారి అనేక ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ లోని ప్రముఖ రైల్వే స్టేషన్ కాచిగూడ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ఈ స్పెషల్ ట్రైన్స్ ను నేటి నుంచి నడపనుంది. ఈ స్పెషల్ ట్రైన్స్.. కాచిగూడ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కాచిగూడ, కాచిగూడ నుంచి కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ నుంచి కాచిగూడ మధ్య ప్రయాణించనున్నాయి. ఈ స్పెషల్ ట్రైన్స్ లో ఏసీ – 2 టైర్, ఏసీ – 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉండనున్నాయని అధికారులు చెప్పారు.
- తిరుపతి వెళ్లాలనుకునే వారికోసం ఈ రోజు రాత్రి 10.10 గంటలకు కాచిగూడ నుంచి తిరుపతి స్పెషల్ ట్రైన్ బయలుదేరనుంది. ఈ స్పెషల్ ట్రైన్ నెం -07061 రాత్రి 10.10 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి.. రేపు ఉదయం 10.30 గంటలకు తిరుపతికి చేరుకుంది.
- మే 26వ తేదీ తిరుపతి నుంచి ట్రైన్ నెం- 07062 ) ట్రైన్ కాచిగూడ వరకూ నడపనున్నట్లు దక్షణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్ రేపు 3 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి.. మే 27వ తేదీ ఉదయం 4 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
- హైదరాబాద్ నుంచి కాకినాడ వరకూ వెళ్లాలనుకునే ప్లాన్ చేస్తున్న ప్రయాణికుల కోసం కాచిగూడ నుంచి ట్రైన్ – 07417 ట్రైన్ కాకినాడ టౌన్ వరకూ స్పెషల్ ట్రైన్ ను అధికారులు ప్రకటించారు. ఈ స్పెషల్ ట్రైన్ మే 27వ తేదీ రాత్రి కాచిగూడ నుంచి రాత్రి 8:45 గంటలకు బయల్దేరి.. మే 28వ తేదీ ఉదయం 08:45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ కాచి గూడ నుంచి వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్ల కోట స్టేషన్ ల్లో ఆగనుంది.
- అదేవిధంగా కాకినాడ టౌన్ నుంచి ట్రైన్ నెంబర్ 07418 స్పెషల్ ట్రైన్ మే 28వ తేదీ రాత్రి 09.55 గంటలకు బయలుదేరి.. మే 29 వ తేదీ 09:45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
ప్రయాణీకులు ఈ స్పెషల్ ట్రైన్ సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.