Pheasants Farming: అన్నదాతకు వరం అడవి కోడి పెంపకం.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. పూర్తి వివరాలు మీ కోసం

సమయంలో పౌల్ట్రీ, కోడిమాంసం కంటే నేల నెమలి కోడి సాగులో ఎక్కువ లాభం ఉంటుందని రైతులు భావిస్తున్నారు. ఈ పక్షుల పెంపకానికి తక్కువ ఖర్చు అవుతుంది. రైతు సోదరులు అడివి కోడి పెంపకం ప్రారంభించాలంటే.. అందుకు లైసెన్స్ తీసుకోవాల్సిందే. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిజానికి, ఈ నెమలి కోడి ఒక అడవి పక్షి.

Pheasants Farming: అన్నదాతకు వరం అడవి కోడి పెంపకం.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. పూర్తి వివరాలు మీ కోసం
Pheasants Farming
Follow us
Surya Kala

|

Updated on: May 23, 2023 | 9:37 AM

భారతదేశం వ్యవసాయ దేశం. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయంతో పాటు పౌల్ట్రీ, బాతులను పెంచుతారు. మాంసం, గుడ్లు అమ్మి రైతులు బాగా సంపాదిస్తున్నారు. విశేషమేమిటంటే, వివిధ రాష్ట్రాల్లో, పౌల్ట్రీ, బాతుల పెంపకం ప్రారంభించడానికి ప్రభుత్వం రైతులకు సబ్సిడీని కూడా ఇస్తుంది. అదే సమయంలో ఇప్పుడు గ్రామంలోని చిన్న రైతులు కోడిలో ఒకరమైన నేల నెమలి కోడి లేదా  అడివి కోడి పెంపకం చేపట్టాలనే కోరిక  కలుగుతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కోడి గుడ్లతో పాటు ఈ నేల నెమలికోడి మాంసానికి డిమాండ్ పెరిగింది. దీంతో నెమలి కోడి పెంపకంతో రైతులు బాగా సంపాదిస్తున్నారు.

అదే సమయంలో పౌల్ట్రీ, కోడిమాంసం కంటే నేల నెమలి కోడి సాగులో ఎక్కువ లాభం ఉంటుందని రైతులు భావిస్తున్నారు. ఈ పక్షుల పెంపకానికి తక్కువ ఖర్చు అవుతుంది. రైతు సోదరులు అడివి కోడి పెంపకం ప్రారంభించాలంటే.. అందుకు లైసెన్స్ తీసుకోవాల్సిందే. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిజానికి, ఈ నెమలి కోడి ఒక అడవి పక్షి. విచక్షణా రహితంగా వేటాడటం వల్ల ఇప్పుడు పల్లెటూళ్ల నుంచి అడవుల్లోకి ఈ పక్షులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అడవి కోడి మాంసాన్ని తినేందుకు ఇష్టపడే వారు ఎక్కువ అవుతున్నారు. ఈ నేల నెమలి కోడి పెంపకందారుల నుంచి నెమలి గుడ్లు, మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ పక్షులను గ్రామాల్లో అడవి కోడి అని కూడా అంటారు.

విశేషమేమిటంటే ఈ అడవి కోడి సాగు ప్రారంభించడానికి పెద్దగా డబ్బు అవసరం లేదు. రైతు సోదరులు కావాలంటే కేవలం కొన్ని వేల రూపాయల్లోనే ఇంటి లోపల ఈ పక్షుల పెంపకం చేపట్టవచ్చు. ఒక అడవి కోడి  ఏడాదికి దాదాపు 300 గుడ్లు పెడుతుంది. రైతు సోదరులు 10 కోళ్లను పెంచుతూ వ్యాపారం ప్రారంభిస్తే.. ఏడాదికి 3000 గుడ్లు అమ్మవచ్చు. వీటిని అమ్మి బాగా సంపాదించవచ్చు.

ఇవి కూడా చదవండి

నెమలి 45 రోజుల్లో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది.

అడవి కోడి పుట్టిన ఒక నెల తరువాత.. దీని బరువు 200 గ్రాముల వరకు ఉంటుంది. 45 రోజుల తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. వైద్యుల ప్రకారం ఈ అడవి కోడి మాంసం తినడం ద్వారా, శరీరానికి తగినంత విటమిన్లు, పోషకాలు అందుతాయి. కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు