Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు విధించిన కోర్టు..! ఇంతకీ అంతపెద్ద నేరం ఏం చేశాడంటే..

రెండేళ్ల చిన్నారికి ఉత్తర కొరియా ప్రభుత్వం జీవిత ఖైదు విధించింది. మాటలు కూడా రాని వయసు.. అప్పుడే నడక నేర్చుకునే పసితనంలో ఏం నేరం చేయగలుగుతుందనేగా మీ అనుమానం..? నిజానికి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ విధించే ఆంక్షలు ప్రత్యేకంగా..

రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు విధించిన కోర్టు..! ఇంతకీ అంతపెద్ద నేరం ఏం చేశాడంటే..
2 Year Old Boy Sent To Life Imprisonment
Follow us
Srilakshmi C

|

Updated on: May 28, 2023 | 5:20 PM

రెండేళ్ల చిన్నారికి ఉత్తర కొరియా ప్రభుత్వం జీవిత ఖైదు విధించింది. మాటలు కూడా రాని వయసు.. అప్పుడే నడక నేర్చుకునే పసితనంలో ఏం నేరం చేయగలుగుతుందనేగా మీ అనుమానం..? నిజానికి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ విధించే ఆంక్షలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ దేశంలో మత పరమైన స్వేచ్ఛ నిషిద్ధం. మత నియమాలను ఉల్లంఘిస్తే పిల్లలతో సహా ఎవరికైనా కఠిన శిక్షలు అమలు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. తాజాగా ఆ దేశంలోని ఓ ఇంట్లో క్రైస్తవ మత గ్రంధం బైబుల్‌ ఉన్నందుకు ఓ కుటుంబం మొత్తానికి జీవిత ఖైదు విధించినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. తల్లిదండ్రులతో పాటు అభంశుభం ఎరుగని రెండేళ్ల పనికందును కూడా జైలుకు పంపించారు.

తాజాగా అమెరికా విడుదల చేసిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ-2022 నివేదిక ప్రకారం.. సుమారు 70,000 మంది క్రైస్తవులు, అలాగే ఇతర మతపరమైన నేపథ్యాలకు చెందిన వ్యక్తులు ప్రస్తుతం ఉత్తర కొరియాలో జైలు జీవితం అనుభవిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నివేదిక అందించిన సమాచారం మేరకు 2009లో రెండేళ్ల చిన్నారితో సహా మొత్తం కుటుంబానికి జీవిత ఖైదు విధించినట్లు పేర్కొంది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది.

ఉత్తర కొరియాలో క్రైస్తవులుగా గుర్తించబడిన వారికి మరణశిక్ష విధిస్తారు. మతపరమైన ఆచారాలలో పాల్గొనడం, మతపరమైన వస్తువులను కలిగి ఉండటం, అంతెందుకు ఇతర మతాలకు చెందిన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నా అక్కడ నేరమే. అటువంటి వారికి కఠిన శిక్షలు అమలు చేస్తుంది ఆ దేశ ప్రభుత్వ. అక్కడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న క్రైస్తవ ఖైదీలు దయనీయమైన పరిస్థితులు అనుభవిస్తున్నట్లు నివేదిక తెల్పింది. ఖైదీలను దారుణంగా హింసిస్తున్నారని, బలవంతంగా పని చేయిస్తున్నారని, లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు.. డిసెంబర్ 2021లో కొరియా ఫ్యూచర్ పేరిట విడుదలైన డాక్యుమెంటరీ వెల్లడించింది. మతపరమైన స్వేచ్ఛ ఉల్లంఘనకు పాల్పడిన 151 మంది క్రైస్తవ మహిళలను ఇంటర్వ్యూ చేయగా ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండిస్తూ యునైటెడ్ స్టేట్స్‌తో సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.