Buffaloes In Pool: స్విమ్మింగ్ పూల్‌లో గేదెల జలకాలాటలు.. ఓనర్స్‌కి రూ.25 లక్షల జరిమానా.. వైరల్ అవుతున్న వీడియో..

Buffaloes In Pool: చెరువులు, సరస్సులలో గేదెలు పడుకోవడం అనేది మనదేశంలో సర్వసాధారణం. అయితే యూకేలోని గేదెలు అలా నీటిలో పడుకున్నందుకు వాటి ఓనర్స్‌కి ఏకంగా లక్షల్లోనే జరిమానా పడింది. అవును, పొలం నుంచి తప్పించుకున్న గేదెల మంద పక్కనే..

Buffaloes In Pool: స్విమ్మింగ్ పూల్‌లో గేదెల జలకాలాటలు.. ఓనర్స్‌కి రూ.25 లక్షల జరిమానా.. వైరల్ అవుతున్న వీడియో..
Buffaloes In Pool
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 28, 2023 | 11:32 AM

Buffaloes In Pool: చెరువులు, సరస్సులలో గేదెలు పడుకోవడం అనేది మనదేశంలో సర్వసాధారణం. అయితే యూకేలోని గేదెలు అలా నీటిలో పడుకున్నందుకు వాటి ఓనర్స్‌కి ఏకంగా లక్షల్లోనే జరిమానా పడింది. అవును, పొలం నుంచి తప్పించుకున్న గేదెల మంద పక్కనే ఉన్న ఇంటి ఆవరణలోకి ప్రవేశించి స్విమ్మింగ్ పూల్‌లో మునిగాయి. దీన్ని చూసిన ఆ ఇంటి ఓనర్స్ గేదెల యజమానికి రూ. 25 లక్షలు జరిమానా విధించారు. దీంతో సదరు యజమాని తన గేదెలు చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకున్నారు.

అసలేం జరిగిందంటే.. యూకేలోని ఎస్సెక్స్‌కి చెందిన అండీ, లిన్నెట్ స్మిత్ దంపతులు ఎంతో ఖర్చు చేసి మరీ తమ ఇంటి ఆవరణలో స్విమ్మింగ్ పూర్ నిర్మించుకున్నారు. అయితే పొలం నుంచి తప్పించుకున్న 18 గేదెలు వారి పూల్‌లో హాయిగా జలకాలాడాయి. దీనికి సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ దృశ్యాన్ని నేరుగా గమనించిన అండీ దంపతులు.. గేదెల యజమానికి జరిగిన విషయం చెప్పి జరిమానా కట్టాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

‘నా భార్య వంటగది కిటికీలోంచి బయటకు చూసినప్పుడు 8 గేదెలు పూల్‌లో ఉండడాన్ని చూసింది.  మా ఇంటి ఫెన్సింగ్,  పూల మొక్కలు ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ గేదెల మంద కారణంగా  ధ్వంసమయ్యాయి. ఆమె వెంటనే 999 కి కాల్ చేసింది కానీ ఫైర్ డిపార్ట్‌మెంట్ ముందుగా నమ్మలేదు. కానీ తర్వాత వచ్చి ఆ గేదెలను వెళ్లగొట్టారు’ అని అడ్రీ తెలిపారు. అయితే NFU మ్యూచువల్ అనే భీమా సంస్థ జరిమానా చెల్లించామని, సమస్య క్లియర్ అయిందని ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..