Road to IPL Final: ఐపీఎల్ ట్రోఫీ కోసం ధోని, పాండ్యా ఢీ.. ఫైనల్ వరకు తమ జట్లను ఎలా నడిపించారంటే..?

CSK vs GT Road to IPL Final: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కోసం 58 రోజులుగా కొనసాగుతొన్న నిరీక్షణకు మరి కొన్ని గంటల్లో తెర పడనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ టోర్నీ విజేత ఎవరో కూడా ఈ రోజే తేలిపోనుంది. అవును,ఈ రోజే..

Road to IPL Final: ఐపీఎల్ ట్రోఫీ కోసం ధోని, పాండ్యా ఢీ.. ఫైనల్ వరకు తమ జట్లను ఎలా నడిపించారంటే..?
Ipl Final 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 28, 2023 | 10:10 AM

CSK vs GT Road to IPL Final: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కోసం 58 రోజులుగా కొనసాగుతొన్న నిరీక్షణకు మరి కొన్ని గంటల్లో తెర పడనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ టోర్నీ విజేత ఎవరో కూడా ఈ రోజే తేలిపోనుంది. అవును,ఈ రోజే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ తుది పోరు జరగనుంది. ఇక మ్యాచ్‌లో గెలిచిన టీమ్ టోర్నీ విజేతగా మరోసారి అవతరిస్తుంది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటికే అత్యంత విజయవంతమైన జట్లుగా గుజరాత్, చెన్నై జట్లు నిలిచి ఫైనల్‌కి చేరుకున్నాయి. అయితే ఈ క్రమంలో రెండు జట్లు కూడా ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. పలుమార్లు ఓటమిని కూడా చవిచూశాయి. అయినప్పటికీ తుది పోరు వరకు చేరుకోగలిగాయి.

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌‌లోనే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడగా.. ధోని సేన ఓటమి పాలైంది. అలా గుజరాత్ టీమ్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడి 10 విజయాలను నమోదు చేసుకుంది. అలాగే ధోని సేన కూడా 14 మ్యాచ్‌లలో 8 గెలిచింది. మళ్లీ క్వాలిఫయర్ 1లో కూడా ఈ జట్లు తలపడగా.. అందులో చెన్నై టీమ్ విజయం సాధించింది. అసలు ఐపీఎల్ 16వ సీజన్‌లో ఈ రెండు జట్ల ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రచారం..

తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఓటమి

2వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 12 పరుగుల తేడాతో విజయం.

3వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు.

4వ మ్యాచ్‌‌ని రాజస్థాన్ రాయల్స్ చేతిలో 3 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది.

5వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడి 8 పరుగుల తేడాతో విజయం.

6వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు.

7వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 49 పరుగుల తేడాతో చెన్నై విజయం.

8వ మ్యాచ్- రాజస్థాన్ రాయల్స్ చేతిలో 32 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది.

9వ మ్యాచ్- పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది.

10వ మ్యాచ్- లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

11వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం.

12వ మ్యాచ్- ఢిల్లీ క్యాపిటల్స్‌పై 27 పరుగుల తేడాతో విజయం.

13వ మ్యాచ్- కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో ధోని సేనను ఓడించింది.

14వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 77 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 15 పరుగుల తేడాతో ధోని టీమ్ గెలిచి.. ఐపీఎల్ 16వ  సీజన్ ఫైనల్‌కి చేరుకుంది.

గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 16వ సీజన్‌ ఫైనల్స్‌కు ఎలా చేరిందంటే..

మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం.

2వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం.

3వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 3 వికెట్ల తేడాతో గుజరాత్ ఓడిపోయింది.

4వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం.

5వ మ్యాచ్- రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో ఓటమి.

6వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 7 పరుగుల తేడాతో విజయం.

7వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో విజయం.

8వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కూడా 7 వికెట్ల తేడాతో విజయం.

9వ మ్యాచ్- ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 పరుగుల తేడాతో ఓటమి.

10వ మ్యాచ్- రాజస్థాన్ రాయల్స్‌పై 9 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.

11వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 56 పరుగుల తేడాతో విజయం.

12వ మ్యాచ్- ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఓటమి.

13వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది

14వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో విజయం.

తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 15 పరుగుల తేడాతో గుజరాత్ ఓడిపోయింది.

క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 62 పరుగుల తేడాతో గెలుపు ద్వారా ఐపీఎల్ ఫైనల్‌కి చేరింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..