Asia Cup 2023: విజయభేరి మోగిస్తున్న టీమిండియా.. డిఫెండింగ్ చాంప్స్ ఖాతాలో వరుసగా రెండో విజయం..
Junior Asia Cup 2023: ఓమన్ వేదికగా జరుగుతున్న జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. బుధవారం చైనీస్ తైపీపై 18–0 తేడాతో విజయం సాధించిన జూనియర్స్ టీమిండియా..
Junior Asia Cup 2023: ఓమన్ వేదికగా జరుగుతున్న జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. బుధవారం చైనీస్ తైపీపై 18–0 తేడాతో విజయం సాధించిన జూనియర్స్ టీమిండియా.. గురువారం జపాన్‌పై 3-1 వ్యత్యాసంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌లో ఆరంభంలో జపాన్ తరఫున యసుడా(19వ నిముషంలో) ఒక గోల్ నమోదు చేశాడు.
అయితే ద్వితీయార్ధంలో మన ప్లేయర్లు పుంజుకున్నారు. ఈ క్రమంలో అరైజీత్ సింగ్(36వ నిమిషంలో), శ్రద్ధానంద్ తివారీ(39వ నిమిషంలో), ఉత్తమ్ సింగ్(56వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. దీంతో మ్యాచ్ ముగిసే సరికి ఇండియన్ జూనియర్స్ టీమ్ 3-1 ఆధిక్యంలో నిలిచి, గెలుపును కైవసం చేసుకుంది.
India come back from behind to claim victory over Japan in their second game of Men’s Junior Asia Cup 2023. Keep it up ?#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/hKcUM22j2t
— Hockey India (@TheHockeyIndia) May 25, 2023
మరోవైపు భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం కాగా.. శనివారం పాకిస్థాన్ జూనియర్స్ హాకీ టీమ్‌తో తలపడనుంది. ఇక ఈ టోర్నీలో విజయం సాధించిన జట్టు నేరుగా హకీ ప్రపంచ కప్‌కి అర్హత సాధిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..