Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Statue: ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హై కోర్ట్ స్టే కొనసాగింపు.. తదుపరి విచారణ ఎప్పుడంటే..?

NTR Statue: ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే  కొనసాగుతోంది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదిభట్ల శ్రీకళాపీఠం, భారత యాదవ సమితి వేసిన లంచ్ మోషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు విగ్రహం..

NTR Statue: ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హై కోర్ట్ స్టే కొనసాగింపు.. తదుపరి విచారణ ఎప్పుడంటే..?
Ts High Court On Ntr Statue
Follow us
Narender Vaitla

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: May 25, 2023 | 8:34 PM

NTR Statue: ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే  కొనసాగుతోంది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదిభట్ల శ్రీకళాపీఠం, భారత యాదవ సమితి వేసిన లంచ్ మోషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు విగ్రహం ఏర్పాటు చేయకూడదంటూ అదేశాలు జారీచేసింది. అలాగే తుదితీర్పును జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఎన్టీఆర్ విగ్రహంపై  అభ్యంతరం లేదు కానీ.. శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడం వల్ల హిందువులు ముఖ్యంగా యాదవుల మనోభావాలు దెబ్బతింటున్న వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టొద్దని ఈ నెల 18న స్టే విధించారు. దీనిపై  విధించిన స్టేను ఎత్తివేయాలంటూ నిర్వాహకులు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. శ్రీ కృష్ణుని రూపంలో విగ్రహ ఏర్పాటుపై వ్యతిరేకత రావటంతో మార్పులు చేసినట్టు నిర్వాహకుల తరపున అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు చెప్పారు. విగ్రహం నుంచి నెమలి ఫించం, పిల్లన గ్రోవిని తొలగించినట్టు వివరించారు. ఇందుకు సంబంధిన ఫోటోలను కూడా సదరు అడ్వకేట్ న్యాయస్థానానికి సమర్పించారు.

మరోవైపు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారి తరపు వాదనలు వినిపించిన న్యాయవాది సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పబ్లిక్ ప్లేసులో విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదన్నారు. లేక్ వద్ద అనుమతి ఇస్తే చెరువు మధ్యలో విగ్రహాన్ని పెడుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటే ఆయన పోషించిన వేరే పాత్రల రూపంలో పెట్టుకోవచ్చన్నారు. అలా కాకుండా దేవుని రూపంలో విగ్రహం పెట్టటం ఏంటని, విగ్రహ ఏర్పాటుపై స్టేని పొడిగించాలని కోరారు. అయితే సదరు న్యాయవాది వ్యాఖ్యలపై జోక్యం చేసుకున్న జస్టిస్ రాంచందర్ రావు.. శ్రీ కృష్ణుని రూపంలో సినిమాల్లో నటించినపుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు? అని అన్నారు. అలాగే శ్రీ కృష్ణుడు ఒక కులానికి దేవుడు కాదని, ప్రపంచం మొత్తానికి ఆరాధ్య దైవమన్నారు. దేవునికి కులాన్ని ఆపాదించటం సమంజసం కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తుది తీర్పును రిజర్వ్ చేసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..