AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో మరోసారి హీటెక్కిన రాజకీయం.. అవతరణ దినోత్సవం వేదికగా బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్

అసలే ఇది ఎన్నికల టైమ్. గట్టిగా మరో 5 నెలల టైమ్ కూడా లేదు. పైగా అవతరణ దినోత్సవం అంటే సెంటిమెంట్ అంశం. ఈసారి జరిగేవి దశాబ్ది వేడుకలు కాబట్టి.. BRS- BJP ఎవరూ తగ్గడం లేదు. ఇక పీసీసీ ఆధ్వర్యంలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అవతరణ వేడుకలను పార్టీ తరపున ఎలా నిర్వహించాలనే అంశంపై ..

తెలంగాణలో మరోసారి హీటెక్కిన రాజకీయం.. అవతరణ దినోత్సవం వేదికగా బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్
Brs Vs Bjp
Follow us
Jyothi Gadda

|

Updated on: May 25, 2023 | 9:54 PM

సెప్టెంబర్‌-17 వచ్చిన ప్రతిసారి BRS- BJP మధ్య వాగ్వాదం నడుస్తూనే ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది BJP. ఇప్పుడు రాష్ట్రంలో BRS VS BJPగా మరోవార్‌కి రంగం సిద్ధమైంది. ఈసారి టాపిక్‌ జూన్-2. పోటీపోటీగా అవతరణ దినోత్సవాలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నాయి రెండు పార్టీలు. అటు కాంగ్రెస్‌ కూడా అవతరణ వేడుకల నిర్వహణపై రేపు ఓ సమావేశాన్ని జరుపుతోంది. ఎన్నికలవేళ పార్టీలన్నీ మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని బలంగా తెరపైకి తెస్తున్నాయి. అయితే, తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. 21 రోజుల పాటు ప్రతి రోజూ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పుడు BJP కూడా సీన్‌లోకి వస్తోంది. ప్రభుత్వానికి ధీటుగా ..అవతరణ వేడుకల్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

గత ఏడాది కూడా ఢిల్లీలో రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవాన్ని నిర్వహించింది కేంద్రం. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి..అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి దశాబ్ది వేడుకల్ని అంతకంటే ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది కేంద్రం. అయితే వేదిక మాత్రం ఇంకా డిసైడ్ కానట్లు తెలుస్తోంది. గత ఏడాది మాదిరిగానే ఢిల్లీలోనే జరుపుతారా? లేక తెలంగాణలో నిర్వహిస్తారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

గతంలో ఢిల్లీలో జరిపారు కాబట్టి.. ఈసారి హైదరాబాద్‌లో కేంద్రసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జూన్‌-2 వేడుకలను జరపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారని తెలుస్తోంది.. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తోంది BJP. అసలే ఇది ఎన్నికల టైమ్. గట్టిగా మరో 5 నెలల టైమ్ కూడా లేదు. పైగా అవతరణ దినోత్సవం అంటే సెంటిమెంట్ అంశం. ఈసారి జరిగేవి దశాబ్ది వేడుకలు కాబట్టి.. BRS- BJP ఎవరూ తగ్గడం లేదు. ఇక రేపు గాంధీ భవన్‌లోనూ పీసీసీ ఆధ్వర్యంలో ఓ సమావేశం జరుగుతోంది. అవతరణ వేడుకలను పార్టీ తరపున ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చిస్తారు ముఖ్యనేతలు..సో.. ప్రస్తుతానికి రాజకీయమంతా జూన్‌-2 చుట్టూ తిరుగుతోందన్నమాట.