Hyderabad: మటన్ కత్తితో లవర్‌ని చంపిన అఫ్తాబే..ఈ హైదరాబాద్ చంద్రమోహన్‌కు ఇన్‌స్పిరేషన్..!
తీగలగూడలో పోలీసులకు దొరికిన ఓ మహిళ తల... ఎవరిదీ తల ... అనురాధ అనే నర్సుది... మరి మొండెం ఎక్కడ?...హంతకుడెవరు...? అనురాధతో 15 ఏళ్లుగా సహజీవనం చేసిన మిస్టర్ చంద్రమౌళే హంతకుడు.. కానీ.. అతడి ఇన్‌స్పిరేషన్ ఏంటి... అతడి వెనకున్న మాస్టర్ మైండ్ ఎవరు... ఇంకెవరు ఆఫ్తాబ్.. ఢిల్లీ హంతకుడు. మటన్ కత్తితో లవర్‌ని చంపిన అఫ్తాబ్.

ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా ఉద్యోగం… సైడ్ బిజినెస్‌గా వడ్డీ వ్యాపారం… ఇలా నెట్టుకొస్తున్న 55 ఏళ్ల అనురాధారెడ్డితో 15 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు చంద్రమోహన్. ఆ విధంగా ఏర్పడ్డ చనువు…. అతడికి 18 లక్షలు అప్పు ఇచ్చేలా చేసింది. పైగా చంద్రమోహన్ ఇంట్లోనే అద్దెకుంటూ… చిలకాగోరింకల్లా బతికేశారు. అప్పుల పాలైన చంద్రమోహన్ డబ్బు ఇవ్వమని ఒత్తిడి తీసుకొచ్చిన అనురాధ… ఇలా వీళ్ల సహజీవన కథను అడ్డం తిరిగింది. ఆమెను చంపితే ఆల్ సెటిల్డ్ అని డిసైడైన చంద్రమోహన్… భారీ స్కెచ్చేశాడు. మటన్ కత్తితో ఆమె తలను తెగ్గొట్టేశాడు. ప్లాస్టిక్ కవర్లో చుట్టి మూసీ నదిలో పడేశాడు. ఇతర శరీర భాగాల్ని 2 బకెట్లలో వేసి, తన ఇంట్లోనే ఫ్రిడ్జ్ లో దాచి పెట్టాడు.
చంపడం… అంతే ఈజీగా ఆ విషయాన్ని దాచిపెట్టడం… పోలీసుల నుంచి తప్పించుకు తిరగడం.. చాలా ఈజీ బ్రో అంటున్నాడీ మిస్టర్ చంద్రమోహన్. అలాగని అంతకుముందు మర్డర్లు చేసిన అనుభవం కూడా లేదు. మరి… అనూరాధను అంత అవలీలగా ఎలా హతమార్చేశాడు.. అంటే మాస్టర్ మైండ్ అఫ్తాబ్ పేరు చెప్పుకొచ్చాడు. ఎవరీ అఫ్తాబ్ అంటే… ఢిల్లీ మర్డర్ ఫైల్స్ వెనక్కి తియ్యాల్సిందే. 2022 మే 18… ఢిల్లీని వణికించిన ఒక మర్డర్ కేసు… 27 ఏళ్ల శ్రద్ధావాకర్‌ని దాదాపు అంతే వయస్సున్న బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ అమీన్ పూనావాలా… చంపి పాతరేశాడు. ప్రాణాలు తీసి… ముక్కలుముక్కలుగా కోసి… ఆ ముక్కల్ని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఆ తర్వాత ఇదే తరహా మర్డర్లు అనేకం జరిగాయి. కానీ.. అంత దారుణంగా మాత్రం కాదు..
ఇప్పుడు మలక్‌పేట్‌లో జరిగిన అనూరాధారెడ్డి హత్య మాత్రం శ్రద్ధా వాకర్ హత్యతో పోల్చదగ్గదే. చంపడం, పీస్‌పీస్ చెయ్యడం… ఒక్కటొక్కటిగా డిస్‌పోజ్ చెయ్యడం… సేమ్‌టు సేమ్ శ్రద్ధావాకర్ మర్డర్ లాంటిదే ఇది కూడా. మటన్ కొట్టడమే అఫ్తాబ్ ప్రొఫెషన్. అందుకే మటన్ కత్తితోనే ఫియాన్సీకి మర్డర్ ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. ఢిల్లీ హంతకుడు అఫ్తాబ్ చేసిన హత్యను స్పూర్తిగా తీసుకుని… సదరు వీడియోల్ని పదేపదే చూసి లోతుగా స్టడీ చేసి.. అనురాధను చంపానంటున్నాడు జెంటిల్ మేన్‌లా కనిపిస్తున్న ఈ చంద్రమోహన్.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..
