Crassula Plant Vastu Tips: ఈ బుల్లి మొక్క ఇంట్లో నాటితే.. అదృష్టం మీ వెంటే..! సరైన దిశ తెలుసుకోండి

మీ ఇంటిలో శక్తి ప్రవాహానికి అంతరాయం లేని ప్రదేశాలలో క్రాసులా మొక్కను ఉంచండి. ఇకపోతే, బెడ్‌ రూమ్‌లలో ఈ క్రాసులా మొక్కను అస్సలు ఉంచరాదట.. వంటగది దగ్గర కూడా ఈ మొక్కను ఉంచకూడదు. అలాగే, మీరు పనిచేస్తున్న కార్యాలయంలో ఒత్తిడి లేకుండా ఉండటానికి, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, మీరు ఈ మొక్కను మీ డెస్క్‌కు

Crassula Plant Vastu Tips: ఈ బుల్లి మొక్క ఇంట్లో నాటితే.. అదృష్టం మీ వెంటే..! సరైన దిశ తెలుసుకోండి
Herbal Plant Cultivation
Follow us
Jyothi Gadda

|

Updated on: May 25, 2023 | 8:10 PM

మనీ ప్లాంట్ సంపదకు చిహ్నంగా భావిస్తారు. అలాంటిదే మరో మొక్క ఆర్ధిక అభివృద్ధికి పునాదిగా చెబుతారు.. అదే క్రాసుల. దీన్నే జడ్‌ ప్లాంట్‌ అని కూడా అంటారు. జడ్‌ప్లాంట్‌ ఇంట్లో ఉంటే ఆర్థిక అభివృద్ధి, డబ్బుకు కొరత ఉండదని భావిస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల శుభప్రదంగా భావిస్తారు. ఈ క్రాసుల మొక్కను మీ ఇంటికి లేదా ఆఫీసుల్లో పెంచుకునే ముందు ఏ దిశగా ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకోవటం ముఖ్యం. ఈ మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటుకోవటం శుభప్రదంగా చెబుతున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. మీరు ఈ మొక్కను ఇల్లు లేదా కార్యాలయానికి సరైన దిశలో ఉంచినట్లయితే, అది వాస్తు దోషాలను తొలగించడమే కాకుండా, ఇంట్లో సంపదకు కారణం అవుతుంది. అంతేకాదు.. ఈ మొక్క కేవలం వాస్తు పరంగానే కాకుండా సహజ గాలి శుద్దీకరణగా కూడా పనిచేస్తుంది. కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది.

అయితే, ఇంటికి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కను నాటకూడదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. మెయిన్‌ డోర్ శక్తి, కార్యాచరణ ప్రదేశంగా పరిగణిస్తారు. కాబట్టి, క్రాసులా మొక్కలను మెయిన్ డోర్ కు దూరంగా ఉంచాలని చెబుతున్నారు. మీ ఇంటిలో శక్తి ప్రవాహానికి అంతరాయం లేని ప్రదేశాలలో క్రాసులా మొక్కను ఉంచండి. ఇకపోతే, బెడ్‌ రూమ్‌లలో ఈ క్రాసులా మొక్కను అస్సలు ఉంచరాదట.. వంటగది దగ్గర కూడా ఈ మొక్కను ఉంచకూడదు. అలాగే, మీరు పనిచేస్తున్న కార్యాలయంలో ఒత్తిడి లేకుండా ఉండటానికి, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, మీరు ఈ మొక్కను మీ డెస్క్‌కు నైరుతి దిశలో ఉంచండి. ఇది ఖచ్చితంగా మీకు విజయాన్ని ఇస్తుంది.

Crassula Plant

Crassula Plant

మీకు వ్యాపారం ఉన్నట్లయితే, ఆ స్థలంలో మీ క్యాష్ కౌంటర్ పైన ఈ మొక్కను నాటడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ క్రాసుల మొక్కను ముఖ్యంగా బహిరంగ ప్రదేశంలో నాటడం శుభప్రదం. క్రాసులా మొక్కను ఇంట్లో చీకటి ప్రదేశంలో ఉంచినట్లయితే, అది ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో మంచి సూర్యకాంతి తగిలే ప్రదేశంలో ఉంచండి. ఇంటి బాల్కనీ టెర్రస్‌లో ఉంచినట్లయితే, అది శ్రేయస్సుకు దారి తీస్తుంది. మొక్క ఆకులకు దుమ్ము పడకుండా చూసుకోవాలి..దాంతో సానుకూల శక్తిని తెస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..