AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఎంత గొప్ప ఇల్లాలివి తల్లి..! నాకు ఇలాంటి భార్యే కావాలంటున్న నెటిజన్లు.. ఇంతకీ ఏం చేసిందంటే..

ధూమపానం చాలా ప్రమాదకరమని అందరికీ తెలుసు. ధూమపానం చేసేవారికి కూడా ఇది తెలుసు. సినిమా థియేటర్లలో కూడా ధూమపానం ఆరోగ్యానికి హానికరం,ఇది క్యాన్సర్‌కు కారణమవుతుందని వింటుంటాం. కానీ కొందరికి ఈ అలవాటు మానేయడం చాలా కష్టం.

Watch: ఎంత గొప్ప ఇల్లాలివి తల్లి..! నాకు ఇలాంటి భార్యే కావాలంటున్న నెటిజన్లు.. ఇంతకీ ఏం చేసిందంటే..
Wife Helping Her Husband
Jyothi Gadda
|

Updated on: May 25, 2023 | 7:30 PM

Share

ధూమపానం చాలా ప్రమాదకరమని అందరికీ తెలుసు. ధూమపానం చేసేవారికి కూడా ఇది తెలుసు. సినిమా థియేటర్లలో కూడా ధూమపానం ఆరోగ్యానికి హానికరం,ఇది క్యాన్సర్‌కు కారణమవుతుందని వింటుంటాం. కానీ కొందరికి ఈ అలవాటు మానేయడం చాలా కష్టం. ధూమపానం వల్ల పొగ తాగే వారికే కాకుండా ఆ పొగ పీల్చే వారికి కూడా సమస్యలు వస్తాయి. అన్ని తెలిసి కూడా.. పురుషులే కాదు స్త్రీలు కూడా అనేకమంది ధూమపానం చేస్తారు. అయితే ఓ భార్య తన భర్తకు పొగ తాగడానికి సహాయం చేయడం ఎప్పుడైనా చూశారా? భర్త ధూమపానం గురించి ఫిర్యాదు చేసే ఆడవాళ్లను చూశాం..అతనిని ఆపడానికి ప్రయత్నించే భార్యల బాధల గురించి విన్నాం. కానీ, పొగ త్రాగడానికి సహాయం చేసే భార్యను ఎక్కడా చూడలేదని చెప్పాలి. కానీ, ఈ ఇల్లాలు గొప్ప హృదయం కలది..ఎందుకంటే.. భర్త బైక్‌ నడుపుతుంటే భార్య అతనికి సిగరెట్‌ తాగిస్తోంది.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

వీడియోలో కనిపిస్తున్నట్లుగా,..ఓ జంట స్కూటర్‌పై ప్రయాణిస్తున్నారు. బైక్‌పై కూర్చున్న మహిళ ఒక చేతిలో జెండా లాంటిది పట్టుకుని ఉంది.. మరోవైపు సిగరెట్ పట్టుకుని ఉంది. స్కూటర్ ముందు ఓ పిల్లాడు కూడా కూర్చున్నాడు. ఇదంతా పక్కన ప్రయాణిస్తున్న కారు ప్రయాణికులు వీడియో తీశారు. బైక్‌ నడుపుతూనే అతడు సిగరెట్ అడుగుతున్నట్లు ముఖం తిప్పేస్తాడు. అందుకు అతని భార్య అతని నోటికి సిగరెట్ అందిస్తుంది. అతడు పఫ్ తీసుకున్న తర్వాత మళ్లీ వెనక్కి తీసుకుంటుంది. పదే పదే అతడికి సిగరెట్‌ పఫ్‌ అందిస్తున్న ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ హస్నా జరూరీ హై షేర్ చేశారు. ఈ వీడియో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 175.1k మంది ఇప్పటికే వీడియోను వీక్షించారు. వీడియో వ్యవధి 20 సెకన్లు మాత్రమే. ‘నాకు ఇలాంటి భార్య ఉంటే బాగుండేది’ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయబడింది. ఇక అంతే వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు తమదైన స్టైల్లో స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..