AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ప్రాణాలకు తెగించి కుక్కను కాపాడిన యువకుడు.. వీడియో చూసి మెచ్చుకుంటున్న నెటిజన్లు

అక్కడి ఉష్ణోగ్రత కారణంగా చూస్తుండగానే సరస్సు మంచుగడ్డగా మారిపోతుంది. అలాంటి స్థితిలో కుక్క సరస్సులోకి జారిపోయింది. దాంతో మేము నిస్సహాయంగా చూస్తూ ఉండగా అది చాలా సేపు కష్టపడింది. ఒడ్డుకు చేరుకోవడానికి మంచును తొలగించే ప్రయత్నం శాయశక్తుల చేసింది. కానీ,

Watch: ప్రాణాలకు తెగించి కుక్కను కాపాడిన యువకుడు.. వీడియో చూసి మెచ్చుకుంటున్న నెటిజన్లు
Rescue Dog
Jyothi Gadda
|

Updated on: May 25, 2023 | 5:09 PM

Share

యజమానుల కోసం కుక్కలు ప్రాణాలర్పించే ఘటనలు అనేక చూశాం.. ఇక్కడ కుక్క కోసం యజమాని ప్రాణాలకు తెగించి చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సగం గడ్డకట్టిన సరస్సులో పడిపోయిన హస్కీ కుక్కను ప్రాణాలకు తెగించి రక్షించాడు దాని యజమాని. చూట్టూ మైనస్ డిగ్రీల చల్లటి వాతావరణంలో గడ్డకట్టిన సరస్సులో పడిపోయిన కుక్కను ఆ వ్యక్తి చాకచక్యంగా రక్షించి ఒడ్డుకు చేర్చాడు. ఇప్పుడి దృశ్యం వైరల్ అవుతోంది. అమెరికాలోని కొలరాడోలో చోటు చేసుకుంది ఈ ఘటన. అమెరికాలోని కొలరాడోలో స్లోన్ లేక్ వద్ద తీసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి సరస్సులోకి దూకి మంచును పగలగొట్టుకుంటూ కుక్కను చేరుకోవడం కనిపించింది. మంచును విరగ్గొడుతూ అతడు..కుక్కను తిరిగి ఒడ్డుకు చేర్చాడు.

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు, హోలీ మార్ఫ్యూ ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్‌ చేశారు. పెద్దబాతులు వెంటాడుతున్నప్పుడు కుక్క సరస్సులోకి పరిగెత్తిందని రాశారు. అక్కడి ఉష్ణోగ్రత కారణంగా చూస్తుండగానే సరస్సు మంచుగడ్డగా మారిపోతుంది. అలాంటి స్థితిలో కుక్క సరస్సులోకి జారిపోయింది. దాంతో మేము నిస్సహాయంగా చూస్తూ ఉండగా అది చాలా సేపు కష్టపడింది. ఒడ్డుకు చేరుకోవడానికి మంచును తొలగించే ప్రయత్నం శాయశక్తుల చేసింది. కానీ, అది అలసిపోతుంది. దాంతో వారు వెంటనే 911కి కాల్ చేసినట్టుగా వెల్లడించారు. కానీ, అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు కుక్కకు ప్రమాదం తప్పేలా లేదని అందరూ ఆందోళనలో పడ్డారు. కానీ, అంతలోనే జాసన్ స్కిడ్జెల్ అనే వ్యక్తి గొప్ప సాహసం చేశాడు..వెంటనే కుక్కను రక్షించడానికి సరస్సులోకి దిగినట్టుగా హోలీ మార్ఫ్యూ వెల్లడించింది. అతడు మంచును విరుచుకుంటూ కుక్కను చేరుకున్నాడు. అలా మెల్లిగా దాన్ని ఒడ్డుకు లాక్కొచ్చాడని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకు 1.6 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి. చాలా మంది స్కిడ్జెల్ ధైర్యసాహసాలు, సత్వరతను ప్రశంసించారు. వైరల్‌ వీడియో పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..