AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బామ్మకు పారిస్‌ ట్రిప్‌తో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మనవళ్లు.. నెటిజన్ల ప్రశంసలు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

విదేశాలకు వెళ్లడం సాధారణంగా ప్రతి ఒక్కరి కల. చదువు, ఉద్యోగం వగైరా నెపంతో విదేశాలకు వెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేయాలని కలలు కంటారు. ఈ సందర్భంలో ఈ ఇద్దరు మనవళ్లు తమ నానమ్మను విదేశాలకు తీసుకెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చారు.

బామ్మకు పారిస్‌ ట్రిప్‌తో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మనవళ్లు.. నెటిజన్ల ప్రశంసలు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Grandmother1
Jyothi Gadda
|

Updated on: May 25, 2023 | 4:37 PM

Share

జీవితంలో ఒక్కసారైనా విదేశాలకు వెళ్లాలని, అక్కడి జీవితాన్ని ఆస్వాదించాలనేది చాలామంది కల. కానీ డబ్బు సమస్యల కారణంగా వారి కల కలగానే మిగిలిపోవాల్సి వస్తుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కూడా చాలా మంది భావిస్తుంటారు. కొంతమంది ఉద్యోగంలో చేరి పొదుపు చేసి విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. అరుదుగా కొందరు తమ తల్లిదండ్రులను కూడా విదేశాలకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఇక్కడ ఇద్దరు యువకులు ఎవరూ చేయని ఒక గొప్పపని చేశారు. ఉన్న ఊళ్లోనే బరువుగా భావించే నానమ్మ తమతో పాటు విదేశీ పర్యటనకు విమానంలో తీసుకెళ్లారు. పారిస్, ఇటలీ పర్యటనతో వారి నానమ్మ ఆశ్చర్యపర్చాలని నిర్ణయించుకున్నారు ఆ ఇద్దరు సోదరులు. అనుకున్నదే తడవుగా టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. నానమ్మ తమతో పాటు ప్యారిస్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వీడియో ఆధారంగా వారు ప్రస్తుతం UKలో ఉన్నారు. దంతవైద్యుడిగా పని చేస్తున్నారు. మమ్మల్ని పెంచేందుకు చాలా కష్టపడ్డానని ఎప్పుడూ నానమ్మ చెబుతూ ఉండేది. కాబట్టి, ఆమెకు గొప్ప ఆనందాన్ని అందించాలని తాము భావించామని చెప్పారు. అందుకే నానమ్మను పారిస్ ట్రిప్ కి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా ఆ ఇద్దరు సోదరులు చెప్పారు. వాటి టూర్‌ ఎంజాయ్‌మెంట్‌ క్షణాలను తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్‌ చేశారు. ఆ నానమ్మ తన జీవితంలో ఇవి మరుపురాని మధుర క్షణాలుగా చెప్పింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Dr Usama Ahmed (@drusamayt)

వీడియోలో, వారు పారిస్‌లోని తమ హోటల్ గది నుండి దూరంగా చూస్తున్న అమ్మమ్మ ఆనందాన్ని చూపించారు. అంతేకాదు ఆ వీడియోలో పారిస్ వీధుల్లో తిరుగుతున్నారు. షాపింగ్‌కి వెళ్తున్నారు. అందరూ కలిసి ఈఫిల్ టవర్ దగ్గర పోజులివ్వడం చూడవచ్చు. ‘మా నానమ్మ అన్ని కష్టాలు మర్చిపోయి సంతోషంగా జీవించేలా చేయడం మా కర్తవ్యం’ అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం మమ్మల్ని పెంచడం కోసమే కష్టపడింది. కాబట్టి, ఇప్పుడు మా వంతు’ అని పేర్కొన్నారు.

View this post on Instagram

A post shared by Dr Usama Ahmed (@drusamayt)

ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి ఇన్‌స్టాగ్రామ్‌లో 367K కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది. సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా వ్యాఖ్యానించారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. డబ్బు, ఉద్యోగాల కంటే మనల్ని మనం ఎలా చూసుకుంటామనేదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు ‘మీలాంటి ప్రతి తల్లి కొడుకును దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు ఆమెను పొందడం ఎంత అదృష్టమో, ఆమె మిమ్మల్ని పొందడం అంతే అదృష్టం అంటూ వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..