పెద్దనోటుకు బడా ఆఫర్.. రూ. 2వేల నోట్లతో షాపింగ్ చేస్తే భారీ డిస్కౌంట్లు.. క్యూ కట్టిన జనాలు
అయితే రూ.2000 నోట్లు ఉన్న వారు వాటిని సెప్టెంబర్ 30, 2023 వరకు మార్చుకోవచ్చు. అంటే, మీరు రూ. 2000 నోటును దాదాపు 4 నెలల పాటు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవచ్చు. లేదంటే మార్చుకోవచ్చు. రూ.2000 నోట్లను బ్యాంకులు మార్చుకుని, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో డిపాజిట్ చేస్తున్నారు.
2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రకటించింది. దీంతో సామాన్య ప్రజలతో పాటు దుకాణదారులకు తలనొప్పి మొదలైంది.. అయితే ఈ కష్ట సమయాల్లో కూడా కొంతమంది తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకునేవాడే అసలైన వ్యాపారవేత్త అన్నట్టుగా.. రెండువేల నోటు ఉన్నవారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు కొందరు వ్యాపారులు. రూ.2 వేల నోట్లతో షాపింగ్ చేస్తే భారీ డిస్కౌంట్లు, గొప్ప ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కొన్నిచోట్ల 2000 రూపాయలకు బదులుగా 2100 రూపాయల విలువైన కిరాణా వస్తువులు ఇస్తుండగా, మరికొన్ని చోట్ల రూ. 2000వేలకు రూ. 2100 విలువ చేసే చికెన్, మటన్ ను ఇస్తున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని పలు దుకాణాల ఎదుట ఇవే బోర్డులు దర్శనమిస్తున్నాయి. దుకాణదారులు ఇలాంటి ఆఫర్ తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.
ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో రూ.2000 నోటును చూసి చాలా మంది దుకాణదారులు ఆందోళన చెందుతుండగా, ఢిల్లీలోని ఓ దుకాణదారుడు రూ.2000 నోటు ఇచ్చి రూ.2100 విలువైన వస్తువులను తన దుకాణంలో తీసుకెళ్లేందుకు ఆఫర్ ప్రకటించాడు. సంక్షోభంలో కూడా తన వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాన్ని చూసే దుకాణదారుడి ఈ ఆఫర్ మొత్తం ఇంటర్నెట్ ప్రపంచాన్ని కదిలించింది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వ్యక్తిని అభినందిస్తున్నారు.
సుమిత్ అగర్వాల్ అనే ట్విటర్ యూజర్ తన ఖాతా నుండి ఈ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో షాప్ గ్లాస్‌పై చేతితో రాసిన పోస్టర్. రూ.2000 నోటు ఇచ్చి రూ.2100 విలువైన వస్తువులను తీసుకెళ్లండి’ అని రాసి ఉంది. దీంతో పాటు రెండు వేల రెండు నోట్లను కూడా అతికించారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. సుమిత్ అగర్వాల్ ఇలా వ్రాశాడు, “ఆర్‌బిఐ తెలివైనదని మీరు అనుకుంటే, మరోసారి ఆలోచించండి, ఎందుకంటే ఢిల్లీ వాసులు దాని కంటే తెలివైనవారు. వారి అమ్మకాలను పెంచడానికి గొప్ప ఆలోచనచేశారు. ఇదిలా ఉంటే, ఢిల్లీలోని ఓ చికెన్ షాపు యజమాని కూడా ఇలాంటి ఆఫర్ తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో మరో వ్యాపారి 2500 విలువైన బ్రాండెడ్ దుస్తుల్ని 2వేల రూపాయల నోటు ఉంటే 500 రూపాయల డిస్కౌంట్‌తో ఇస్తున్నాడు. ఇలా కొంతమంది వ్యాపారులు తెలివిగా 2వేల నోటుని తమ బిజినెస్ కోసం ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత అందరిలాగే వారు కూడా వాటిని బ్యాంకుల్లో మార్చేసుకుంటున్నారు.
If you think RBI is smart, think again cos Delhites are much smarter.
What an innovative way to increase your sales! ?#2000Note pic.twitter.com/ALb2FNDJi0
— Sumit Agarwal ?? (@sumitagarwal_IN) May 22, 2023
ఆర్‌బీఐ నిర్ణయంతో రూ. 2,000 కరెన్సీ నోటు జనాల్లో కలకలం రేపింది. నగదు కోసం ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. పెట్రోల్ పంపులు, నగల దుకాణాలు నగదు లావాదేవీల హాట్‌స్పాట్‌లుగా మారాయి. అయితే, రూ. 2000వేల నోటుపై ఆర్బీఐ నిర్ణయం మేరకు తక్షణమే చట్టవిరుద్ధం కాకపోవడం ప్రజలకు ఉపశమనం కలిగించే విషయమే. అయితే రూ.2000 నోట్లు ఉన్న వారు వాటిని సెప్టెంబర్ 30, 2023 వరకు మార్చుకోవచ్చు. అంటే, మీరు రూ. 2000 నోటును దాదాపు 4 నెలల పాటు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవచ్చు. లేదంటే మార్చుకోవచ్చు. రూ.2000 నోట్లను మార్చుకుని బ్యాంకులు, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో డిపాజిట్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..