AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈజీ మనీ కోసం ముగ్గురు కలిసి కార్‌ కొట్టేశారు…కానీ, పాపం ఎవరికీ డ్రైవింగ్‌ రాదు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

వీరంతా కలిసి ఈజీ మనీ కోసం కాన్పూర్ లోని దబౌలి ప్రాంతంలో ఓ మారుతి వ్యాన్ ను కొట్టేశారు. కానీ, కంగారులో వారికి కారు నడపడం రాదని తెలుసుకోలేకపోయారు. దాంతో రాత్రి 10 కిలోమీటర్లు వ్యాన్ ను తోసుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఓ చోట కారు నెంబర్ ప్లేట్ తొలగించి, కారును దాచిపెట్టారు. కానీ, కథ అడ్డం తిరిగింది.

ఈజీ మనీ కోసం ముగ్గురు కలిసి కార్‌ కొట్టేశారు...కానీ, పాపం ఎవరికీ డ్రైవింగ్‌ రాదు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Car Theft
Jyothi Gadda
|

Updated on: May 24, 2023 | 6:59 PM

Share

ఇది చాలా రసవత్తరమైన దొంగతనం కేసు. ముగ్గురు యువకులు కలిసి చేసిన ఓ చోరీ కేసులో ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. ఇద్దరు విద్యార్థులు, ఉద్యోగి అయిన వారి స్నేహితుడితో కలిసి దొంగతనానికి ప్లాన్‌ చేశారు. ముగ్గురూ కలిసి ఓ మారుతీ వ్యాన్‌ను దొంగిలించేందుకు స్కెచ్ వేశారు. అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. అయితే దాన్ని దొంగిలించి వేరే చోటికి తీసుకెళ్తుండగా.. ముగ్గురిలో ఏ ఒక్కరికీ డ్రైవింగ్ రాదని తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే..! ఆసక్తికరమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో వెలుగు చూసింది.

చాకచక్యంగా దొంగతనం చేసిన ముగ్గురు దొంగలు.. డ్రైవింగ్ చేయలేక కారును అక్కడే వదలిపెట్టి వెళ్లలేక రాత్రికి రాత్రే దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు కారును తోసుకుంటూ వెళ్లారు. 10 కిలోమీటర్ల తర్వాత అలసిపోయిన ఈ దొంగలు కారు నెంబర్ ప్లేట్ తీసేసి నిర్జన ప్రదేశంలో దాచి పరారయ్యారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది..కాలేజీలో చదువుతున్న సత్యం కుమార్, అమన్ గౌతమ్, అమిత్ వర్మ అనే ముగ్గురు దొంగల్ని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సత్యం బీటెక్ చదువుతుండగా.. అమన్ బీకామ్, అమిత్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరంతా కలిసి ఈజీ మనీ కోసం కాన్పూర్ లోని దబౌలి ప్రాంతంలో ఓ మారుతి వ్యాన్ ను కొట్టేశారు. కానీ, కంగారులో వారికి కారు నడపడం రాదని తెలుసుకోలేకపోయారు. దాంతో రాత్రి 10 కిలోమీటర్లు వ్యాన్ ను తోసుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఓ చోట కారు నెంబర్ ప్లేట్ తొలగించి, కారును దాచిపెట్టారు. కానీ, కథ అడ్డం తిరిగింది. దొంగతనం కేసు పోలీసుల వద్దకు చేరింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ముగ్గురు నిందితులు మే 7న దబౌలి ప్రాంతం నుంచి కారు దొంగిలించినట్లుగా ఏసీపీ భేజ్ నారాయణ్ సింగ్ వెల్లడించారు. కారు నడపడం రాకపోవడంతో దబౌలి నుంచి కళ్యాణ్ పూర్ వరకు 10 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లారని చెప్పారు. ఈ దోపిడీకి అమిత్ స్కెచ్ వేయగా.. దీన్ని వెబ్ సైట్ ద్వారా అమ్మేందుకు సత్యం ప్లాన్ చేశాడని, ఒకవేళ కొనడానికి ఎవరూ దొరక్కపోతే.. వెబ్ సైట్ ద్వారా విక్రయించాలని ప్లాన్ చేసినట్లు ఏసీపీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..