Viral: డబ్బు డ్రా చేసేందుకు ATM వద్దకు వెళ్లిన వ్యక్తి.. లోపల కార్డు పెట్టగానే.. క్యాష్‌కు బదులు
ఇది నిజంగా ఊహించని సీనే. ఏటీఎం నుంచి మాములుగా డబ్బులు వస్తాయ్. కానీ ఇక్కడ మాత్రం పాములు వచ్చాయ్. మెషీన్ లోపల ఏకంగా 10 పాము పిల్లలు ఉండటం చూసి స్థానికులతో పాటు బ్యాంకు అధికారులు స్టన్ అయ్యారు.
ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లాలో ఓ ఎటీఎం మెషీన్ నుంచి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన వ్యక్తి కంగుతిన్నాడు. అక్కడ నుంచి పరుగులు తీశాడు. అతడి ప్రవర్తన చూసి అక్కడి జనాలు కూడా హడలిపోయారు. అతడు అలా బిహేవ్ చేయడానికి రీజన్ ఉందండోయ్. మాములుగా ఏటీఎం నుంచి డెబిట్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ అక్కడ ఊహించని ఘటన జరిగింది. కార్డు మెషీన్‌లో పెట్టగానే.. డబ్బులకు బదులు పాములు బయటకు వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి కంగారుపడ్డాడు.
జిల్లాలోని రామ్‌నగర్ కోసీ మార్గంలో ఉన్న SBI ఏటీఎంకు మనీ తీసేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. మెషీన్‌లో ATM కార్డు పెట్టగానే.. అతడికి ఓ పాము తారసపడింది. అనుకోని ఆ పరిణామానికి భీతిల్లిన ఆ వ్యక్తి.. గట్టిగా అరుస్తూ పరుగుతు తీశాడు. దీంతో స్థానికంగా ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అతడు ATM సెక్యూరిటీ గార్డుకు విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న బ్యాంకు అధికారులు ATM సెంటర్‌కు చేరుకున్నారు.
ఇన్పర్మేషన్ ఇవ్వడంతో సేవ్ ది స్నేక్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ చంద్రసేన్ కశ్యప్ కూడా ఏటీఎం వద్దకు వచ్చారు. బ్యాంకు అధికారులు.. ఏటీఎంను తెరివగా… లోపల ఉన్న 10 పాము పిల్లలను రెస్కూ చేశారు చంద్రసేన్. ఆపై వాటిని ఫారెస్ట్ ఏరియాలో వదిలి పెట్టారు. ఆ పాము పిల్లలు చాలా డేంజరస్ అని ఆయన వివరించారు. ఏటీఎం లోపలకు పాములు ఎలా వెళ్లిందో బ్యాంకు అధికారులకు అంతుబట్టడం లేదు. తాత్కాలికంగా ఆ ఏటీఎం సెంటర్‌ను క్లోజ్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..