Watch: యే దిల్ మాంగే మోర్.. తొలిసారిగా ఇండియన్ ఫుడ్ రుచి చూసిన అమెరికన్ బుడ్డొడు ఫిదా..
బ్రెడ్ బట్టర్‌కే అలవాటు పడిన అమెరికన్లు ఇండియన్ ఫుడ్ రుచిచూస్తే వదలడం లేదు. పెద్దోళ్లదాకా ఎందుకు? చిన్నారులు సైతం ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టపడుతున్నారు. ఇక్కడ కూడా పాపడ్, పానీపూరీని టేస్ట్ చేసిన ఓ చిన్నారి ఇక వాటిని మళ్లీ మళ్లీ కావాలంటోంది. అంతేకాదు, దాల్ తడ్కా, రైస్,నాన్ వంటివి కూడా రుచిచూసింది. ఈ చిన్నారి,
భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ఆదరణ పెరిగింది. విభిన్నమైన, సువాసనగల రుచులతో ఇండియన్ వంటకాలు ప్రపంచవ్యాప్త సంచలనంగా మారడంలో ఆశ్చర్యం లేదు. భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను ఎలా గెలుచుకున్నాయి అనేదానికి ఈ వీడియో ఒక ఉదాహరణ మాత్రమే. ఇది భారతీయ వంటకాల రమణీయతను మాత్రమే కాకుండా, దాని సాంస్కృతిక ఔచిత్యాన్ని కూడా హైలైట్ చేస్తుంది. బ్రెడ్ బట్టర్‌కే అలవాటు పడిన అమెరికన్లు ఇండియన్ ఫుడ్ రుచిచూస్తే వదలడం లేదు. పెద్దోళ్లదాకా ఎందుకు? చిన్నారులు సైతం ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టపడుతున్నారు. ఇక్కడ కూడా పాపడ్, పానీపూరీని టేస్ట్ చేసిన ఓ చిన్నారి ఇక వాటిని మళ్లీ మళ్లీ కావాలంటోంది. అంతేకాదు, దాల్ తడ్కా, రైస్,నాన్ వంటివి కూడా రుచిచూసింది. ఈ చిన్నారి, తల్లిదండ్రులతో కలిసి భారతీయ ఆహారాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండిView this post on Instagram
విదేశీయులు భారతీయ ఆహారాన్ని ప్రయత్నించడం, వారి అనుభవాలను పంచుకోవడం వంటి అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు న్యూయార్క్‌లోని ఓ తల్లి తన బిడ్డను ఇండియన్ రెస్టారెంట్‌కి తీసుకెళ్లింది. అక్కడ చిన్న పిల్లవాడు మొదటిసారిగా ఇండియన్ ఫుడ్ తింటున్నాడు. అప్పుడు ఆ తల్లి తన బిడ్డ రియాక్షన్‌ను వీడియో తీసింది. ఆ సీన్ మొత్తాన్ని పార్ట్ 1, పార్ట్ 2గా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఆమె పానీ పూరీ నుండి దాల్ తడ్కా వరకు ప్రతి వంటకాన్ని రూచి చూపించింది. బ్రిడ్జేట్ కూలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది.
View this post on Instagram
ప్రస్తుతం ఈ రెండు వీడియోలను కూడా నెటిజన్లు విపరీతంగా ఆదరిస్తున్నారు. వందల కొద్దీ లైక్‌లు వచ్చాయి. చిన్న వయస్సులోనే తన పిల్లలకు వివిధ వంటకాలను పరిచయం చేసినందుకు ప్రజలు కూలిక్‌ను ప్రశంసించారు. మరొక వినియోగదారు ఇలా అన్నారు.. మీరందరూ భారతీయ రెస్టారెంట్‌లో తినడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. మీ చిన్న పాప దాల్ తడ్కా, అన్నం ట్రై చేయడం చాలా బాగుంది. మా పిల్లలకు 6 నెలలు నిండినప్పటి నుండి ప్రతి భారతీయ ఇంటిలోనూ మేము సరిగ్గా అదే తినిపించాము అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..